apsrtc: ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో మాస్కు తప్పనిసరి చేసింది. ప్రయాణికులు మాస్కు ధరించకుంటే రూ.50 జరిమానా విధించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు..
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 1,257 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 38,479 శాంపిల్స్‌కు నిర్ధరణ పరీక్షలు చేశారు. చిత్తూరులో 254, విశాఖలో 196, తూర్పుగోదావరిలో 93, కృష్ణా లో 117, గుంటూరులో 104, నెల్లూరులో 103, ప్రకాశంలో 40, శ్రీకాకుళంలో 55, అనంతపురంలో 138, కర్నూలులో 29, కడపలో 20, పశ్చిమగోదావరిలో 25, విజయనగరంలో 83 కేసులు నమోదైనట్లు అధికారులు వివరించారు. రాష్ట్రంలో 4,774 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 24 గంటల వ్యవధిలో గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారని అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 14,505 కు పెరిగింది. 24 గంటల్లో 140 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.
దేశవ్యాప్తంగా కరోనా పంజా..