పర భాష, సంస్కృతుల వ్యామోహంలో... తల్లి భాష తెలుగును మరిచిపోతున్న ఈ కాలంలో..... దాని పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్‌లోని మండలి ఫౌండేషన్ ఎంతగానో కృషి చేస్తోంది. జాతి అభిమానం, భాషాభిమానం మాయమైపోతున్న పరిస్థితుల్లో మరలా జాతిని మేల్కొలిపే ప్రభోధాత్మక రచనలు రావలసిన అవసరాన్ని మండలి ఫౌండేషన్ గుర్తించింది. దీనికి అనుగుణంగా కవులు, రచయితలను ప్రోత్సహించేలా.. ఖండకావ్య, పద్య రచనల పోటీల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. అందుకోసం ఔత్సాహికులను పోటీలకు ఆహ్వానిస్తోంది.
ఖండకావ్య, పద్య రచన పోటీలకు ఏపీలోని మండలి ఫౌండేషన్ ఆహ్వానం - మండలి ఫౌండేషన్ ఆహ్వానం వార్తలు
తెలుగు భాష ఔచిత్యాన్ని నేటి తరాలకూ అందించేందుకు మండలి ఫౌండేషన్ నడుంబిగించింది. ఖండకావ్య, పద్య రచన పోటీలకు కవులు, రచయితలకు ఆహ్వానం పలికింది. ఫౌండేషన్ అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్.. తన తండ్రి మండలి వెంకటకృష్ణారావు జయంతిని పురస్కరించుకుని కార్యక్రమం చేపట్టారు.
పద్య రచన పోటీలకు మండలి ఫౌండేషన్ ఆహ్వానం
తెలుగువారి హృదయాలలో చెరగని ముద్ర వేసేలా..... చిన్న ఖండికలతో కూడిన ఖండ కావ్య పద్య రచనలు చేయాలని..... మండలి ఫౌండేషన్ అధ్యక్షుడు బుద్ధప్రసాద్ సూచించారు. మంచి రచనలు చేసిన వారికి బహుమతులు, ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. రచనల ప్రచురణ బాధ్యత తామే చూసుకుంటామని చెప్పారు. కవులు, రచయితలు.. తమ రచనలను జూలై 21 లోగా తమ చిరునామాకు పంపాలని కోరారు.
ఇదీ చదవండి: