తెలంగాణ

telangana

ETV Bharat / city

దిశ ఘటనలో పోలీసులు పరిధి దాటి ప్రవర్తించారు: మందకృష్ణ

దిశ ఘటనలో పోలీసులు పరిధి దాటి ఎన్​కౌంటర్​ చేశారని ఎంఆర్​పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. హత్యాచార నిందితులను శిక్షించడంలో జాప్యానికి నిరసనగా డిసెంబర్​ 24న ఇందిరాపార్కు వద్ద మహాదీక్ష చేస్తున్నట్లు తెలిపారు.

manda krishna comments on disha accused encounter
దిశ ఘటనలో పోలీసులు పరిధి దాటి ప్రవర్తించారు: మందకృష్ణ

By

Published : Dec 12, 2019, 7:48 PM IST

Updated : Dec 12, 2019, 11:46 PM IST

డిసెంబర్​ 24న ఇందిరాపార్కు వద్ద మహాదీక్ష నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలపై జరిగిన దాడుల నిందితులను శిక్షించడంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు.

దిశ కేసులో పోలీసులు పరిధి దాటి వ్యవహరించారన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం ఎవరి విధులు వారు నిర్వహించాలని సూచించారు. భవిష్యత్​లో న్యాయవ్యవస్థ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందనే సుప్రీంకోర్టు దిశ నిందితుల ఎన్​కౌంటర్ ఘటనపై కమిటీ ఏర్పాటు చేసిందని మందకృష్ణ అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచార నిందితులకు కఠిన శిక్షలు అమలయ్యేలా ఫాస్ట్​ట్రాక్​ కోర్టులు ఏర్పాటుచేయాలని డిమాండ్​ చేశారు.

దిశ ఘటనలో పోలీసులు పరిధి దాటి ప్రవర్తించారు: మందకృష్ణ

ఇవీచూడండి: ప్రపంచ మీడియాలో 'దిశ' నిందితుల ఎన్​కౌంటర్​కు పెద్దపీట

Last Updated : Dec 12, 2019, 11:46 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details