తెలంగాణ

telangana

ETV Bharat / city

manchu manoj: రెండో పెళ్లి విషయంపై మంచు మనోజ్​ క్రేజీ ట్వీట్ - రెండో పెళ్లి విషయంపై మంచు మనోజ్

తనకు రెండో పెళ్లి జరగనుందనే వార్తలపై హీరో మంచు మనోజ్​ స్పందించారు. పెళ్లికి తనని కూడా పిలవాలంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

manchu manoj tweet
manchu manoj tweet

By

Published : Oct 26, 2021, 10:46 PM IST

హీరో మంచు మనోజ్‌ త్వరలోనే రెండో వివాహం చేసుకోనున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మనోజ్‌కు కాబోయే సతీమణి మంచు వారి కుటుంబానికి అత్యంత సన్నిహితురాలంటూ వరుస కథనాలు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై మనోజ్‌ స్పందించారు.

తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలన్నీ అవాస్తవాలేనని వ్యంగ్యంగా చెప్పారు. 'పెళ్లి ఎక్కడ?.. ఆ బుజ్జిపిల్ల, తెల్లపిల్ల ఎవరు?.. పెళ్లికి నన్ను కూడా పిలవండి' అంటూ ట్వీట్​ చేశారు. 'మీ ఇష్టంరా అంతా మీ ఇష్టం' అంటూ కామెంట్‌ చేశారు. మనోజ్‌ పెట్టిన ఈ ట్వీట్‌తో ఆయన పెళ్లి వార్తల్లో నిజంలేదని తెలుస్తోంది.

'దొంగా దొంగది' చిత్రంతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన మనోజ్‌.. ‘రాజుభాయ్‌’, ‘వేదం’, ‘ఝుమ్మంది నాదం’, ‘పోటుగాడు’ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో ప్రణతీ రెడ్డితో ఆయన ఏడడుగులు వేశారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పరస్పర అంగీకారంతో ప్రణతీ నుంచి తాను విడాకులు తీసుకున్నానని 2019లో మనోజ్‌ ప్రకటించారు.

ఇదీ చూడండి:అందుకే నా పాత్రకు హీరోయిన్ లేదు: సల్మాన్

ABOUT THE AUTHOR

...view details