Gym Trainer for Modi : ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా మూడ్రోజుల పాటు హైదరాబాద్‌లోనే బస చేస్తుండగా ఆయనకు ప్రత్యేక వ్యాయామ శిక్షకుడిగా మంచిర్యాల పట్టణానికి చెందిన గడప రాజేశ్ నియమితులయ్యారు. ఈ నెల 2 నుంచి 4వరకు ట్రెడ్‌మిల్, జిమ్ సైకిల్ సాధనకు శిక్షకుడిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు గురువారం తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లోని జింఖానా మైదానంలో అథ్లెటిక్స్ కోచ్(సాట్స్)గా విధులు నిర్వర్తిస్తున్నారు. మూడ్రోజులపాటు దేశ ప్రధాని వ్యాయామ సాధనలో భాగస్వామిని కావడం ఆనందంగా ఉందని రాజేశ్ తెలిపారు.
Gym Trainer for Modi : మోదీ వ్యాయామ శిక్షకుడిగా మంచిర్యాల వాసి - మోదీ జిమ్ ట్రైనర్‌గా రాజేశ్
Gym Trainer for Modi :ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకోనున్న మోదీ.. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం నోవాటెల్‌లో బస చేస్తారు. మోదీ రెండ్రోజుల పర్యటనలో భాగంగా.. ఆయనకు ప్రత్యేక వ్యాయామ శిక్షకుడిని నియమించింది తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ. మంచిర్యాలకు చెందిన గడప రాజేశ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మోదీ షెడ్యూల్.. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు దిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రధాని బయలుదేరతారు. 2 గంటల 55 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. అక్కడి నుంచి 3 గంటలకు హెలికాప్టర్‌లో హెచ్ఐసీసీ నోవాటెల్ కి వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని పాల్గొననున్నారు. రాత్రి నోవాటెల్ హోటల్‌లోనే బస చేసే అవకాశం ఉంది.
Modi Hyderabad Tour : జూలై 3వ తేదీన ఉదయం 10 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభం అవుతుంది. పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి వాటి అమలుకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేస్తారు. సాయత్రం 5 గంటలకు సమావేశం ముగియనుండగా... ఆరు గంటలకు ప్రధాని సహా అగ్రనేతలంతా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని బహిరంగ సభావేదికకు చేరుకుంటారు. సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి నోవాటెల్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి 4వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంకు వెళ్లనున్నారు.