తెలంగాణ

telangana

ETV Bharat / city

'కుమార్తె'పై అత్యాచారం.. 20ఏళ్ల జైలు శిక్ష - man who attempted rape on her daughter in Vijayawada finally sent to jail

కుమార్తె అన్న ఇంగిత జ్ఞానాన్ని మరిచి.. అత్యాచారం చేసిన దుర్మార్గుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది విజయవాడ మహిళా సెషన్స్ న్యాయస్థానం. గత ఏడాది జరిగిన ఘటనపై బాధితురాలని తల్లి ఫిర్యాదుతో... కోర్టు శిక్షను విధించింది.

rape attempt on daughter in vijayawada
'కూతురు'పై అత్యాచారం.. 20ఏళ్ల జైలు శిక్ష

By

Published : Dec 3, 2019, 11:36 AM IST

కుమార్తె వరసయ్యే బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఓ ప్రబుద్ధుడికి విజయవాడ మహిళా సెషన్స్‌ న్యాయస్థానం ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా విధించింది.

విజయవాడలోని ఇబ్రహీంపట్నానికి చెందిన సైకం కృష్ణారావు.. గతంలో ఉయ్యూరు చక్కెర పరిశ్రమలో పని చేస్తుండేవాడు. భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్న ఓ మహిళతో సాన్నిహిత్యం ఏర్పరచుకున్నాడు. దేవుని ఫొటో ముందు ఆమె మెడలో తాళికట్టాడు. అప్పటి నుంచి భార్యభర్తలుగా ఇబ్రహీంపట్నంలోనే జీవనం ప్రారంభించారు.

సదరు మహిళకు ఉన్న పిల్లల్లో పదో తరగతి చదువుతున్న బాలికపై 2018 జనవరి 27న కృష్ణారావు అత్యాచారం చేశాడు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లికి చెప్పగా.. నిందితుడు వారిద్దర్నీ బెదిరించి పారిపోయాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. తర్వాత అదుపులోకి తీసుకున్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విదించింది.

ఇవీచూడండి: 'దిశ' నిందితుల చర్లపల్లి జైలు వీడియో...

For All Latest Updates

TAGGED:

taza

ABOUT THE AUTHOR

...view details