తెలంగాణ

telangana

ETV Bharat / city

ఒకే ఒక్కడు.. పదులకొద్దీ యాప్‌లు - deaths due to online money applications

ఆన్‌లైన్‌ ‘కాల్‌మనీ’ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండటం వల్ల పోలీసు ఉన్నతాధికారులు దానిపై దృష్టి సారించారు. సులభంగా వ్యక్తిగత రుణాలిస్తామంటూ పదుల సంఖ్యలో యాప్​లు రూపొందించిన యువకుణ్ని పోలీసులు గుర్తించారు.

man-was-arrested-who-designed-ten-online-loan-applications
ఒకే ఒక్కడు.. పదులకొద్దీ యాప్‌లు

By

Published : Dec 20, 2020, 9:06 AM IST

సులభంగా వ్యక్తిగత రుణాలిస్తామంటూ అంతర్జాలంలో ప్రకటనలు గుప్పిస్తూ అప్పు తీసుకున్న వారిని వేధిస్తున్న యువకుడు పదుల సంఖ్యలో యాప్‌లు రూపొందించినట్లు సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీస్‌ అధికారులు మరిన్ని వివరాలను సేకరించారు. అతడి బ్యాంక్‌ ఖాతాల్లో నిల్వలు, లావాదేవీల వివరాలను పరిశీలించారు. బినామీ ఖాతాలేమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ఆన్‌లైన్‌ ‘కాల్‌మనీ’ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండటంతో ఐపీఎస్‌ అధికారి స్వయంగా విచారణ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

నాలుగైదు నెలల నుంచే..

యాప్‌ల ద్వారా రుణాలిస్తున్న యువకుడు నాలుగైదు నెలల నుంచి మొబైల్‌ యాప్‌లను తయారు చేస్తున్నట్లు పోలీసు విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. ఆన్‌లైన్‌ ద్వారా రుణాలిస్తున్న మైక్రో ఫైనాన్స్‌ సంస్థల ప్రతినిధులను సంప్రదించాక తాను కూడా సొంతంగా యాప్‌లను తయారు చేయాలనే ఆలోచన కలిగిందని ఆ యువకుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఇప్పటి వరకు ముగ్గురు ఇతడి యాప్‌ల ద్వారా రుణం తీసుకున్నారని, వీరిలో ఇద్దరు పదిహేను రోజులకు తాము తీసుకున్న అప్పు మొత్తానికి 48 శాతం వడ్డీ అదనంగా చెల్లించినట్లు తెలిసింది. ఇంకా డబ్బు చెల్లించాలంటూ వేధిస్తుంటే భరించలేక ఫిర్యాదులు చేశారని తెలిసింది.

యాప్‌లను తొలగించే దిశగా..

ఆన్‌లైన్‌ ‘కాల్‌మనీ’ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన సైబరాబాద్‌ పోలీసులు దా‘రుణ’యాప్‌లను కట్టడి చేసేందుకు చట్టపరంగా ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు.నగదు బదిలీ చేయకపోతే అసభ్య పదజాలంతో దూషించడం, అప్పు తీసుకున్నవారిలో యువతులుంటే వారి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచి కాల్‌గర్ల్‌గా చిత్రీకరించడం వంటివి నేరాలని పోలీసులు గుర్తించారు. వీటన్నింటిపై నివేదికను ప్రభుత్వానికి పంపితే కేంద్ర హోంశాఖ, ఐటీ శాఖలు కాల్‌మనీ యాప్‌లపై ఏకంగా నిషేధం విధించేందుకు అవకాశాలున్నాయని పోలీస్‌ అధికారులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details