ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు-నాగులుప్పలపాడు గ్రామాల మధ్య కొత్తకోట వాగులో గల్లంతైన వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. వాగులో కొంత దూరం కొట్టుకుపోయిన అతను ఒడ్డుకు చేరి 10 కిలోమీటర్లు నడిచి చదలవాడ వరకు చేరుకున్నాడు. అనంతరం చదలవాడ నుంచి ఒంగోలులోని తన నివాసానికి చేరుకున్నాడు.
వాగులో గల్లంతయ్యాడు.. క్షేమంగా ఇంటికి చేరాడు - nivar effect on prakasham district
ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు-నాగులుప్పలపాడు మధ్య కొత్తకోట వాగులో గల్లంతైన రాజేశ్ అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. వాగులో కొంత దూరం కొట్టుకుపోయి ఒడ్డుకు చేరాడు. సుమారు 10 కిలోమీటర్లు దూరం నడిచి ఇంటికి చేరుకున్నాడు.
వాగులో గల్లంతయ్యాడు.. క్షేమంగా ఇంటికి చేరాడు
మద్దిపాడు-నాగులుప్పలపాడు గ్రామాల మధ్య కొత్తకోట వాగు ప్రవాహంలో ఓ కారు గురువారం రాత్రి కొట్టుకుపోయింది. ఈ ఘటనలో రాజేశ్ అనే యువకుడు గల్లంతయ్యాడు. మరో ఇద్దరు యువకులు క్షేమంగా బయటపడ్డారు. స్థానికుల సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ఆ యువకుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు.
ఇదీ చదవండి: నివర్ ఎఫెక్ట్: 5 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు...వెయ్యి కోట్లకుపైగా నష్టం