ఏపీలోని అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ముప్పలకుంట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. కరోనా మృతుని అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. కొద్దిరోజుల అనంతరం గ్రామస్థులు... బాధితుడిలో అవహేళనగా మాట్లాడారు. తనకు కరోనా రాకున్నా గ్రామస్థులు అవమానించడాన్ని తట్టుకోలేక పురుగుల మందు తాగాడు.
కరోనా సోకిందంటూ గ్రామస్థుల అవహేళన... బాధితుడు ఆత్మహత్య - అనంతపురం జిల్లా క్రైం
ఏపీలోని అనంతపురం జిల్లా ముప్పలకుంటలో విషాదం నెలకొంది. ఓ వ్యక్తికి కరోనా వచ్చిందంటూ గ్రామస్థులు అవహేళన చేశారు. గ్రామం విడిచి వెళ్లాలంటూ గ్రామ పెద్దలు హుకుం జారీ చేశారు. అవమానాన్ని తట్టుకోలేక బాధితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

కరోనా సోకిందంటూ గ్రామస్థుల అవహేళన... బాధితుడు ఆత్మహత్య
గమనించిన కుటుంబ సభ్యులు కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:తమిళనాడు, కర్ణాటకలో కోరలు చాస్తోన్న కరోనా