ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం మండలం యానం ఎదురులంక వారధి వద్ద గడిచిన రెండు రోజుల్లో ఆరు ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకున్నాయి. అమలాపురం, రామచంద్రాపురానికి చెందిన ఇద్దరు, యానంకు చెందిన మరో ఇద్దరు, గుర్తు తెలియని మరో వ్యక్తి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి కోసం పోలీసులు వంతెన పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
గోదారిలో దూకితే... వరద ఒడ్డుకు చేర్చింది - గోదావరిలో దూకిన యువకుడు
భూమ్మీద నూకలున్నాయంటే.. పులి నోట్లో నోరు పెట్టినా బతికి బయటపడొచ్చనేది నానుడి. సరిగ్గా అటువంటి సంఘటనే కేంద్రపాలిత ప్రాంతం యానంలో జరిగింది. వడివడిగా సముద్రంలోకి ప్రవహిస్తున్న గోదావరిలోకి వంతెనపై నుంచి దూకిన వ్యక్తిని.. వరద ప్రవాహం ఒడ్డున పడేసింది.
ఇంతలో ముమ్మిడివరంకు చెందిన ఓ వ్యక్తి వంతెనపై నుంచి గోదావరిలో దూకేశాడు. అక్కడే ఉన్న సిబ్బంది పోలీసులు చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. పోలీసులు అప్రమత్తమయ్యేలోగా వరద ప్రవాహం.. ఆ వ్యక్తిని ఒడ్డు వైపునకు నెట్డేసింది. ఈ సంఘటనతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అనారోగ్య సమస్యలు.. కరోనా సోకిందనే భయం.. ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ కలహాలతో వీరంతా ఆత్మహత్యలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. బతికిన వ్యక్తికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వారి బంధువులకు అప్పగించారు.
ఇదీ చదవండి:డివైడర్ స్తంభాన్ని ఢీకొట్టి... గాలిలో ఎగిరి... అక్కడికక్కడే మృతి