తెలంగాణ

telangana

ETV Bharat / city

'చెట్టు దిగరా... బైక్ తాళమిస్తా...' - lock down at tirupathi

లాక్‌డౌన్‌ సమయంలో రహదారిపై తిరగొద్దని వారించడమే తిరుపతి పోలీసుల పాలిట శాపంగా మారింది. వాహనాన్ని ఆపి... పోలీసులు తాళం తీసుకున్నారని ఆగ్రహించిన ఓ యువకుడు చెట్టెక్కాడు. పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకొంటానంటూ బెదిరించాడు. అవాక్కైన పోలీసులు... ఆ యువకుడికి నచ్చచెప్పడానికి ఆపసోపాలు పడ్డారు.

SUICIDE ATTEMPT
'చెట్టు దిగరా... తాళమిస్తా...'

By

Published : Apr 17, 2020, 9:38 AM IST

తిరుపతి బాలాజీ కాలనీ కూడలిలో పహారా కాస్తున్న పోలీసులు టౌన్‌క్లబ్‌ వైపు నుంచి ద్విచక్రవాహనంపై వేగంగా వస్తున్న ఓ యువకుడిని ఆపారు. లాక్‌డౌన్‌ సమయంలో బయట తిరగటాన్ని ప్రశ్నించారు. ఆగ్రహించిన యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. బైక్ తాళం తీసుకున్నారని.. వేగంగా వెళ్లి పక్కనే ఉన్న చెట్టెక్కాడు. దూకుతానంటూ బెదిరించాడు. ఆ యువకుడిని చెట్టు దింపడానికి పోలీసులు గంట పాటు కష్టపడ్డారు.

డ్రామాకు తెరదించుతూ యువకుడు చెట్టు దిగేసరికి పోలీసులు ఊపిరి పీల్చుకొన్నారు. చెట్టు దిగిన యువకుడు... లైసెన్స్‌ ఉన్నా నన్నెందుకు ఆపారంటూ ప్రశ్నించాడు. అవాక్కైన పోలీసులు... అతన్ని స్టేషన్‌కు తరలించారు.

ఇదీ చదవండి: 'మేం ఇక్కడ ఉన్నాం.. మమ్మల్ని రాష్ట్రానికి తీసుకెళ్లండి'

ABOUT THE AUTHOR

...view details