తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రియుడిపై కత్తితో దాడి... ఆపై ఆత్మాహత్యాయత్నం! - కృష్ణా జిల్లా క్రైమ్ వార్తలు

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించాడని...అతన్ని చంపేయాలనుకుంది. అనుకుందే తడవుగా ఓ పథకం పన్నింది. చివరిసారిగా మాట్లాడుకుని ఇక విడిపోదాం అని చెప్పి ఇంటికి పిలిచింది. తీరా వచ్చాక ఒకే సారి కత్తితో దాడి చేసింది. ఆపై ఆత్మహత్యాయత్నం చేసింది.

girl attacked on his bboy friend
ప్రియుడిపై కత్తితో దాడి... ఆపై ఆత్మాహత్యాయత్నం!

By

Published : May 26, 2020, 11:06 AM IST

పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిపై యువతి దాడి చేసిన ఘటన ఏపీలోని కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డలో సంచలనం రేపింది. అనంతరం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్యురకారం యువతి ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తోంది. యువకుడు తహసీల్దార్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా ఇరువురికి పరిచయం ఉండటంతో పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి తెచ్చింది.

అందుకు తిరస్కరించాడు ప్రియుడు. చివరిసారిగా కలిసి మాట్లాడుకుని విడిపోదామంటూ పిలిచింది. సరేనంటూ వక్కలగడ్డ వెళ్లన తనపై ఒక్కసారిగా కత్తితో దాడి చేసిందని...యువకుడు పోలీసులకు తెలిపాడు. యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లటంతో మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి:మద్యం సేవిస్తే.. కరోనా సోకే అవకాశాలు ఎక్కువ!

ABOUT THE AUTHOR

...view details