తెలంగాణ

telangana

ETV Bharat / city

PEGASUS: చంద్రబాబు పెగాసస్​ కొన్నారు: మమతా బెనర్జీ - పెగాసస్ సాఫ్ట్​వేర్

mamata banerjee on pegasus: తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పెగాసస్ సాఫ్ట్​వేర్​ను కొనుగోలు చేశారని ఆమె వెల్లడించారు.

PEGASUS
PEGASUS

By

Published : Mar 18, 2022, 12:25 PM IST

ఆంధ్రప్రదేశ్​లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివాదాస్పద పెగాసస్ సాఫ్ట్​వేర్​ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. ఈ మేరకు ఆమె బుధవారం బెంగాల్ అసెంబ్లీలో మాట్లాడుతూ... 'నాలుగైదేళ్ల క్రితం పెగాసస్ సాఫ్ట్​వేర్​ను రూ.25 కోట్లకు విక్రయిస్తామంటూ దాని సృష్టికర్తలు బెంగాల్ పోలీసులను సంప్రదించారు. విషయం నాకు తెలిసిన వెంటనే తిరస్కరించాను. ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం దానిని కొనుగోలు చేసింది' అని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details