తెలంగాణ

telangana

ETV Bharat / city

సచివాలయానికి తాళం.. చెట్ల కింద కూర్చున్న సిబ్బంది - వైఎస్సార్​ జిల్లా లేటెస్ట్ అప్​డేట్స్

contractor lock to secretariat: ఏపీలోని వైఎస్‌ఆర్‌ జిల్లా ఖాజీపేట మండలం అప్పన్నపల్లి గ్రామ సచివాలయానికి గుత్తేదారు తాళం వేశారు. రెండేళ్లు అవుతున్నా బిల్లులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయానికి తాళం వేయడంతో ఉద్యోగులు చెట్టు కింద కూర్చున్నారు.

సచివాలయానికి తాళం.. చెట్ల కింద కూర్చున్న సిబ్బంది
సచివాలయానికి తాళం.. చెట్ల కింద కూర్చున్న సిబ్బంది

By

Published : Apr 27, 2022, 1:30 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట మండలం అప్పన్నపల్లి గ్రామ సచివాలయానికి గుత్తేదారు తాళం వేశారు. సచివాలయ భవనం నిర్మించి రెండేళ్లు అవుతున్నా.. అధికారులు బిల్లులు చెల్లించలేదనే కారణంతో గుత్తేదారు వాసుదేవరెడ్డి ఇవాళ ఉదయం సచివాలయానికి తాళం వేశారు. రూ.48 లక్షలతో సచివాలయం నిర్మించినట్లు చెప్పారు. రెండేళ్లు అవుతున్నా పంచాయతీ అధికారులు బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయాన్ని 2020 అక్టోబర్ 2న మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రారంభించారన్నారు. అప్పటి నుంచి పలుమార్లు అధికారులను కలిసి బిల్లులు చెల్లించాలని అడిగినా స్పందన లేదని వాపోయారు.

సచివాలయానికి తాళం.. చెట్ల కింద కూర్చున్న సిబ్బంది

తనకు బిల్లులు చెల్లించే వరకు సచివాలయం తలుపులు తెరిచే ప్రసక్తే లేదని వాసుదేవరెడ్డి తేల్చి చెప్పారు. దీంతో సచివాలయానికి విధుల నిర్వహణకు వచ్చిన ఉద్యోగులు సమీపంలోని చెట్ల కింద కూర్చున్నారు. మరోవైపు వారం క్రితం ప్రకాశం జిల్లా ఇండ్లచెరువు గ్రామానికి చెందిన గుత్తేదారు కూడా ప్రభుత్వం బిల్లులు చెల్లించట్లేదని ఇండ్లచెరువు గ్రామ సచివాలయానికి తాళం వేసిన విషయం తెలిసిందే.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details