తెలంగాణ

telangana

ETV Bharat / city

మల్లన్నసాగర్‌కు నాబార్డు నుంచి రూ.4,600 కోట్ల రుణం - మల్లన్నసాగర్‌

2020-21 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ప్రగతి నివేదికను నాబార్డు గురువారం విడుదల చేసింది. బంగారు తెలంగాణ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డు వివిధ రూపాల్లో తోడ్పాటు అందిస్తోందని తెలంగాణ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వై.వి.రావు తెలిపారు. రైతు ఉత్పాదక సంఘాలను మార్కెటింగ్‌ సదుపాయల కోసం వివిధ కార్పొరేట్‌ సంస్థలతో అనుసంధానం చేస్తున్నామన్నారు.

Mallannasagar has a loan of Rs 4,600 crore from NABARD
Mallannasagar has a loan of Rs 4,600 crore from NABARD

By

Published : Apr 9, 2021, 6:59 AM IST

రాష్ట్ర సామాజిక, ఆర్థికాభివృద్ధిలో నాబార్డు క్రియాశీలక పాత్ర పోషిస్తోందని సంస్థ తెలంగాణ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వై.వి.రావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, బంగారు తెలంగాణ సాధనకు రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రూపాల్లో తోడ్పాటును అందిస్తోందన్నారు. రాష్ట్రంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి వివిధ బ్యాంకుల ద్వారా రూ.13,915 కోట్ల పంటరుణాలు, వ్యవసాయ పెట్టుబడి రుణాలను అందజేసిందని తెలిపారు. రైతు ఉత్పాదక సంఘాలను మార్కెటింగ్‌ సదుపాయల కోసం వివిధ కార్పొరేట్‌ సంస్థలతో అనుసంధానం చేస్తున్నామన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ప్రగతి నివేదికను నాబార్డు గురువారం విడుదల చేసింది.
ముఖ్యాంశాలు ఇలా...

  • రాష్ట్రంలో గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.6,633 కోట్ల రుణం మంజూరు. ఈ మొత్తంలో రూ.4,600 కోట్లు మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ కోసం కేటాయించగా రూ.2,394 కోట్లు ఇప్పటికే అందజేసింది.
  • పౌరసరఫరాలశాఖకు ధాన్యం సేకరణ కోసం రూ.2,500 కోట్ల రుణం మంజూరు.
  • ఆర్థిక తోడ్పాటు కార్యక్రమాల్లో భాగంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.16,312కోట్లను అందించగా గత ఆర్థికసంవత్సరంలో రూ.20,549కోట్లు ఇచ్చింది.
  • వ్యవసాయ, వ్యవసాయేతర కార్యక్రమాలకు రూ.41 కోట్ల గ్రాంట్లు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కరోనా పరీక్షలు భారీగా పెంచాలని సీఎం ఆదేశం

ABOUT THE AUTHOR

...view details