ఆరేళ్ల ప్రేమను ఆ గ్రామస్తులు గెలిపించారు. మత్తిలి గ్రామ ప్రజలు ఆ జంటను ఒకటి చేశారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా పరాకిముండికి చెందిన శివకుమార్, సోఫియా ముస్కాన్.. గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ రెండు విభిన్న మతాలకు చెందడం వలన ఇంట్లో వీరి ప్రేమను అంగీకరించలేదు.
ఆరేళ్ల ప్రేమ: కుటుంబీకులు కాదన్నారు.. గ్రామస్తులు గెలిపించారు
ఆరేళ్ల ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. మతాలు వేరు కావటంతో పెద్దలు ససేమిరా అన్నారు. తమ ప్రేమను గెలిపించుకోవాడానికి ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆ ప్రేమ జంటను ఒక్కటి చేయడానికి ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన మల్కాన్‌గిరి జిల్లా మత్తిలి పెద్దలు ముందుకు వచ్చారు.
ఆరేళ్ల ప్రేమను గెలిపించిన గ్రామస్తులు
ఇంటి నుంచి బయటికి వచ్చిన శివకుమార్.. తన అక్కాబావ నివాసం ఉంటున్న మత్తిలికి సోఫియాతో సహా వచ్చారు. వీరి ప్రేమ విషయం తెలిసి మత్తిలి పెద్దలు స్థానిక రామాలయం వద్ద హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేశారు. ప్రేమకు మతం అడ్డుకాదని నిరూపించారు.
ఇదీ చదవండి:పెట్రో ధరల స్పీడుకు బ్రేకులు పడవా!