సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులోని 6వ వార్డులో మల్కాజిగిరి పార్లమెంట్ ఇంఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి 1000 మంది పేదలకు నిత్యావసరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తలసాని, మల్లారెడ్డిలు పాల్గొన్నారు.
'ఆ విషయంలో మాకు సీఎం కేసీఆరే స్ఫూర్తి' - groceries distribution to needy in secundrabad
లాక్డౌన్ వల్ల రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశామని మల్కాజిగి పార్లమెంట్ ఇంఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. రేషన్ కార్డులేని పేదలను గుర్తించి వారికి కూడా రేషన్ సదుపాయం అందిస్తామని తెలిపారు.
సికింద్రాబాద్లో నిత్యావసర సరకుల పంపిణీ
కరోనా నివారణకు విధించిన లాక్డౌన్తో ఎవరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో నిత్యావసరాలు అందజేసినట్లు రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని నెలరోజులుగా పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు.