ఆగస్టు 1 నుంచి డిసెంబర్ 31 వరకు మలేసియా ప్రభుత్వం బ్యాక్ ఫర్ గుడ్ ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ప్రకటించింది. అక్రమవలసదారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లవచ్చని ఆ దేశ హోంమంత్రి తాన్ శ్రీ ముహయ్యిదీన్ తెలిపారు. ఈ క్షమాభిక్ష కాలంలో సాధారణ నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించి స్వదేశం వెళ్లిన వారికి మళ్లీ మలేసియా రావడానికి అనుమతి ఉంటుందని వెల్లడించారు.
రూ.12 వేలు చెల్లించాలి
ఆమ్నెస్టీ ద్వారా స్వదేశాలకు వెళ్లే వారు 700 రింగ్గిట్ మలేసియా కరెన్సీ (ఇండియన్ కరెన్సీలో రూ.12,000) చెలించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికెట్, వారం రోజుల్లో వెళ్లే విధంగా విమాన టికెట్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
సాయం చేయాలంటే!
దీనికి సంబంధించి ఏదైనా సాయం కావాల్సినవారు మలేసియా-తెలంగాణ అసోసియేషన్ను వాట్సాప్ ద్వారా +601118636423, ఈ-మెయిల్ ద్వారా info@myta.com.my లేదా ఫేస్బుక్ ద్వారా సంప్రదించాలని అసోసియేషన్ ప్రెసిడెంట్ సైదం తిరుపతి కోరారు. క్షమాభిక్ష సద్వినియోగం అయ్యేలా మలేసియాలో ఉంటున్న తెలుగు కార్మికులు స్వదేశం చేరేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.