తెలంగాణ

telangana

ETV Bharat / city

'వైకాపాలో మోసపోయానంటూ మహిళ ఆత్మహత్యాయత్నం' - వైకాపా మహిళ ఆత్మహత్యాయత్నం

తనను వైకాపా నాయకులు మోసం చేశారని ఏపీ మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు బొల్లిపల్లి జోని కుమారి ఆరోపించారు. పార్టీలో ఉన్న తనను కొంతమంది నేతలు అన్యాయం చేశారని వాపోయారు. విజయవాడ ప్రెస్ క్లబ్​లో మీడియా ఎదుటే ఆత్మహత్యాయత్నం చేశారు.

'వైకాపాలో మోసపోయానంటూ మహిళ ఆత్మహత్యాయత్నం'
'వైకాపాలో మోసపోయానంటూ మహిళ ఆత్మహత్యాయత్నం'

By

Published : Jul 20, 2020, 6:10 PM IST

తనను వైకాపా నాయకులు మోసం చేశారని ఏపీ మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు బొల్లిపల్లి జోని కుమారి ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్​లో ఆత్మహత్యాయత్నం చేశారు. తనను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని కలిసినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తనకు జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రిని కలిసి విన్నవించాలని ప్రయత్నించినా అపాయింట్​మెంట్ లభించలేదన్నారు.

'నేను వైకాపాకు చెందిన మహిళను. ఏపీ సీఎం జగన్ సమక్షంలోనే పార్టీలో చేరాను. అయితే పార్టీలో కొంతమంది నాయకులు నాకు అన్యాయం చేశారు. బయటకు చెప్పుకోలేని బాధ పడుతున్నాను నేను. ఈ విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి స్పందనా లేదు. కరోనా కారణంగా సీఎంను కలవలేకపోయాను. అందుకే మీడియా ముఖంగా నా బాధను తెలియజేస్తున్నాను'- బొల్లిపల్లి జోని కుమారి, ఏపీ మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు

'వైకాపాలో మోసపోయానంటూ మహిళ ఆత్మహత్యాయత్నం'

ABOUT THE AUTHOR

...view details