తెలంగాణ

telangana

ETV Bharat / city

మక్తాల ఫౌండేషన్​ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ - పర్యావరరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు పూజించాలి

హైదరాబాద్​ మంజు థియేటర్​ సమీపంలో... మక్తాల ఫౌండేషన్​ ఛైర్మన్​ జలంధర్ గౌడ్​ మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను పూజించాలని విజ్ఞప్తి చేశారు.

makthala foundation ganapathi cly idols distribution in hyderabad
మక్తాల ఫౌండేషన్​ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ

By

Published : Aug 22, 2020, 2:19 PM IST

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను పూజించాలని మక్తాల ఫౌండేషన్ చైర్మన్ జలంధర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంజు థియేటర్ సమీపంలో మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్నందున పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే గణపతి ఉత్సవాలు నిర్వహించుకోవాలని తెలిపారు.

మక్తాల ఫౌండేషన్​ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ

మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జలంధర్​ గౌడ్​ అన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణ, వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి మొదలైన నాటి నుంచి తన వంతుగా అవగాహన పెంచే క్రమంలో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రచారం చేస్తున్నట్టు వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details