తెలంగాణ

telangana

ETV Bharat / city

దుబ్బాకలో తెరాస విఫలం... అవే కాంగ్రెస్ అస్త్రాలు : ఉత్తమ్

ఇందిరా భవన్​ దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల సన్నాహక సమావేశం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో జరిగింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్ కార్యకర్తలు దృఢ సంకల్పంతో, క్రమశిక్షణతో పని చేసి చరిత్ర సృష్టించాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, నిర్మాణాత్మకంగా పని చేయాలని సూచించారు.

దుబ్బాకలో తెరాస విఫలం... అవే కాంగ్రెస్ అస్త్రాలు : ఉత్తమ్
దుబ్బాకలో తెరాస విఫలం... అవే కాంగ్రెస్ అస్త్రాలు : ఉత్తమ్

By

Published : Sep 11, 2020, 5:37 PM IST

రెండుపడక గదుల ఇళ్లు ఏమయ్యాయి..

హైదరాబాద్ ఇందిరాభవన్‌లో దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న పీసీసీ అధ్యక్షుడు... తెరాస ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రచార కార్యక్రమాల్లో అధికార పార్టీ నేతలను నిలదీయాలని స్పష్టం చేశారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు ఇస్తామన్న పరిహారం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.

కాంగ్రెస్ సంస్థాగతంగా బలోపేతం కావాలి..

గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ సంస్థాగతంగా బలోపేతం కావాలన్నారు. అన్ని కమిటీలు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కమిటీ అధ్యక్షుడు నర్సారెడ్డికి సూచించారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తోందన్న మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ... రాష్ట్రాన్ని అప్పుల, అవినీతి తెలంగాణగా మార్చారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్నికలు అనగానే...

ఎన్నికలు అనగానే డబ్బు సంచులతో, మద్యం బాటిళ్లతో తెరాస నాయకులు ప్రజల దగ్గరకు వెళతారని రాజనర్సింహ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ చాకచక్యంగా వ్యవహరించి అధికార పార్టీ ఎత్తులకుపై ఎత్తులు వేయాలని సూచించారు.

సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజా నర్సింహ, వర్కింగ్ ప్రసిడెంట్స్ పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్ ఏఐసీసీ కార్యదర్శులు వంశీ చంద్ రెడ్డి, సంపత్ కుమార్, డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి, బలరాం నాయక్, దుబ్బాక నాయకులు పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : కొత్త రెవెన్యూ చట్టంపై సీఎల్పీ నేత భట్టి, సీఎం కేసీఆర్ వాదనలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details