ఫార్మా సిటీలో భారీ పేలుడు.. దట్టంగా అలుముకున్న పొగ - విశాఖ ఫార్మాసిటీలో భారీ పేలుడు
22:55 July 13
ఫార్మా సిటీలో భారీ పేలుడు.. దట్టంగా అలుముకున్న పొగ
ఏపీలోని విశాఖపట్టణం పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం చోటుచేసుకొంది.
రాంకీ సీఈటీపీలోని సాల్వెంట్ ఫార్మా కంపెనీలో పలుమార్లు భారీ పేలుళ్లు సంభవించాయి. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో నలుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని గాజువాక ఆస్పత్రికి తరలించారు.
పలుమార్లు పేలుళ్లతో తొలుత ఘటన స్థలి సమీపానికి అగ్నిమాపక సిబ్బంది వెళ్లలేకపోయారు. ఎట్టకేలకు అగ్నిమాపక యంత్రాలతో ఘటన స్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన చోటుకు మూడు అంబులెన్స్‌లు తరలించినట్లు విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్ వెల్లడించారు.