తెలంగాణ

telangana

ETV Bharat / city

'సర్కారు వారి పాట': ఎన్నడూ చూడని గెటప్​లో మహేశ్! - మహేశ్

అభిమానులకు వరుసగా సినిమాలు చూపించేందుకు సిద్ధమవుతున్న మహేశ్​... 'సర్కారు వారి పాట' సినిమాలో తన గెటప్​తో అభిమానులకు షాక్​ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు చేయని డిఫరెంట్​ గెటప్​లో మహేశ్​ బాబు కనపడనున్నాడట.

Sarkaru Vaari Paata news
Sarkaru Vaari Paata news

By

Published : Oct 6, 2021, 8:36 PM IST

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న "సర్కార్ వారి పాట" చిత్రంలో ఇంటర్వెల్‌కు ముందు ఓ భారీ యాక్షన్ సన్నివేశం ఉంటుందట. ఆ సీన్​లో విలన్​కు మహేశ్​ బాబు.. ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామిలా కనిపిస్తాడట. అయితే మహేశ్​ ఇప్పటివరకు అలాంటి గెటప్​ వేయకపోవడంతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. అయితే సినీ వర్గాల నుంచి మాత్రం దీనికి సంబంధించి ఏవిధమైన సమాచారం వెలువడలేదు. అయినప్పటికీ ఎప్పుడెప్పుడు సినిమా చూసేద్దామా.. ఆ కొత్త లుక్​ను చూసేద్దామా అనే ఉత్సుకతతో అభిమానులు ఉన్నారు. ఇంతకీ ఆ గెటప్​లో మహేశ్​ ఎలా ఉన్నారు... ఎలా నటించారు... ప్రేక్షకుల మనసును దోచేశారా అనేది తెలియాలంటే.. సినిమా రిలీజ్​ అయ్యేవరకు ఆగాల్సిందేనట.

'సరిలేరు నీకెవ్వరు' విజయంతో దూకుడు మీదున్నారు స్టార్ ​హీరో మహేశ్‌బాబు. అదే వేగంతో తన తర్వాతి చిత్రం 'సర్కారువారి పాట'(sarkaru vaari paata) పూర్తి చేద్దామనుకున్నా, ఆ స్పీడ్‌కు కరోనా(coronavirus) బ్రేక్‌లు వేసింది. ప్రస్తుతం షూటింగ్‌లకు ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం వల్ల ఈ సినిమా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారట. దర్శకుడు పరుశురామ్‌ వర్కింగ్‌ స్టైల్‌ కూడా అదే కావడం వల్ల సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందట.

'సర్కారు వారిపాట'లో కథానాయికగా కీర్తి సురేశ్‌(keerthy suresh) నటిస్తోంది. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇదీ చూడండి:వరుణ్​ తేజ్​ 'గని' ఫస్ట్​ పంచ్​.. 'క్లాప్'​ అప్​డేట్

ABOUT THE AUTHOR

...view details