మహారాష్ట్ర నాందేడ్ ప్రజలకు బాబ్లీ నీటి సమస్య పరిష్కారం చాలా ముఖ్యమైనదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ అన్నారు. తెలంగాణ, మహారాష్ట్రల మధ్య వివాదం వల్ల గోదావరి నది నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని తెలిపారు. దీనివల్ల ఇరు రాష్ట్రాలు నష్టపోతున్నాయని చెప్పారు.
'మూడు సార్లు సంప్రదించినా.. కేసీఆర్ స్పందించలేదు' - Babli project dispute
బాబ్లీ నీటి సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ ముఖ్యమంత్రిని మూడుసార్లు సంప్రదించామని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ అన్నారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి అశోక్ చవాన్
బాబ్లీ నీటి సమస్య పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు కలిసి మార్గం వెతకాలని అశోక్ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో ఈ విషయం చర్చించానని తెలిపారు. చర్చల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో.. ఠాక్రే మూడు సార్లు సంప్రదించారని కానీ.. కేసీఆర్ వైపు నుంచి ఎటువంటి స్పందన రాలేదని వెల్లడించారు. బాబ్లీ సమస్య పరిష్కారమయ్యే వరకు తాను విశ్రమించనని అశోక్ చవాన్ స్పష్టం చేశారు. తానే స్వయంగా హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌ను కలుస్తానని చెప్పారు.
- ఇదీ చూడండి :'టీకా పంపిణీలో భాగం కావాలి'