తెలంగాణ

telangana

ETV Bharat / city

ఒవైసీ, కేసీఆర్‌ నగరాన్ని పంచుకున్నారు: దేవేంద్ర ఫడణవీస్‌

మహానగరాన్ని ప్రజానగరంగా భాజపా మారుస్తుందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. ఒవైసీ, కేసీఆర్‌ నగరాన్ని పంచుకున్నారని విమర్శించారు. ఓటు బ్యాంకు కోసం చేసిన తప్పిదాల వల్లే నగరం మునిగిపోయిందని ఆయన ఆరోపించారు.

maharashtra former chief minister devendra fadnavis comments on cm kcr and asaduddin owaisi
ఒవైసీ, కేసీఆర్‌ నగరాన్ని పంచుకున్నారు: దేవేంద్ర ఫడణవీస్‌

By

Published : Nov 26, 2020, 6:27 PM IST

హైదరాబాద్‌ ఎవరి సొంతం కాదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. కొందరి ఆధిపత్యంలో ఉన్న నగరాన్ని భారతీయ జనతా పార్టీ.. తిరిగి అందరి నగరంగా మారుస్తుందని చెప్పారు. జీహెచ్​ఎంసీలో విజయం సాధిస్తే.. భాజపా కార్పొరేటర్లు యజమానులుగా కాకుండా.. సేవకులుగా నగరవాసుల కష్టాలు తీరుస్తారని తెలిపారు.

పాత నగరాన్ని ఒవైసీ, మిగతా నగరాన్ని సీఎం చంద్రశేఖర్‌రావు పంచుకున్నారు. ఇది వాళ్ల సొంత ఆస్తిగా భావిస్తున్నారు. ఈ నగరాన్ని ప్రజలకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాం. ఇది ఒవైసీ నగరం కాదు.. చంద్రశేఖర్‌రావు నగరం కాదు. ఇది హైదరాబాద్‌.. తెలంగాణ ప్రజల నగరం. సొంత ఆస్తిగా మార్చుకున్నారో... దాన్ని తిరిగి హైదరాబాద్‌ ప్రజలకిస్తాం. నగరపాలికను మళ్లీ ప్రజావేదికగా మారుస్తాం. -దేవేంద్ర ఫడణవీస్‌, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి

ఒవైసీ, కేసీఆర్‌ నగరాన్ని పంచుకున్నారు: దేవేంద్ర ఫడణవీస్‌

ఇవీ చూడండి:ఎల్​ఆర్​ఎస్ రద్దు, పాతబస్తీకి స్పెషల్ ప్యాకేజీ.. మేనిఫెస్టోలో భాజపా వరాలు

ABOUT THE AUTHOR

...view details