తెలంగాణ

telangana

ETV Bharat / city

కాణిపాకంలో శాస్త్రోక్తంగా చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

KANIPAKAM TEMPLE కాణిపాకంలో భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తరిస్తూ చేపట్టిన వరసిద్ధి వినాయక ఆలయం పునర్నిర్మాణం పూర్తయింది. నేడు స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు.

KANIPAKAM TEMPLE
KANIPAKAM TEMPLE

By

Published : Aug 21, 2022, 3:34 PM IST

KANIPAKAM TEMPLE ఏపీలోని చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తరిస్తూ చేపట్టిన కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం పునర్నిర్మాణం పూర్తయింది. ఇద్దరు ప్రవాస భారతీయ భక్తులు ఇచ్చిన 10 కోట్ల రూపాయల విరాళాలతో ఆలయాన్ని పునర్నిర్మించారు. దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం.. ప్రస్తుత రద్దీకి సరిపోకపోవడంతో పాత అలయాన్ని పూర్తిగా తొలగించి నూతనంగా నిర్మించారు.

మూడంచెల విధానంలో గర్భాలయం, అంతరాలయం, మహామండపం నిర్మించారు. ఆలయం లోపల భారతీయ సంప్రదాయ కళలతో రూపొందించిన శిల్పాలతో స్తంభాలు ఏర్పాటు చేశారు. 200 మంది శిల్పులు దాదాపు 11 నెలలు శ్రమించి పునర్నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేశారు. ఆలయ పునర్నిర్మాణం పూర్తైన సందర్భంగా ఇవాళ మహా కుంభాభిషేకం చేశారు. ఇందులో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు రోజా, పెద్దిరెడ్డి పాల్గొన్నారు. మధ్యాహ్నం నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

KANIPAKAM TEMPLE

ABOUT THE AUTHOR

...view details