శాంతియుతంగా తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీ(Congress Jung Siren Rally)కి ప్రభుత్వం అనుమతించకపోవటం నిరంకుశధోరణికి నిదర్శనమని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ గౌడ్(Madhu Yashki Goud) పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని.... నిరుద్యోగుల తరఫున కాంగ్రెస్ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు 'జంగ్ సైరన్(Congress Jung Siren Rally)' చేపట్టినట్లు చెప్పారు. తమ పార్టీ చెందిన కార్యకర్తలను, యువకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని... ఇది సరైన చర్య కాదన్నారు. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.... తమ ర్యాలీ(Congress Jung Siren Rally) కొనసాగుతుందని ఆయన తేల్చిచెప్పారు.
"జంగ్ సైరన్ ర్యాలీ(Congress Jung Siren Rally)ని శాంతియుతంగా నిర్వహిస్తామని చెప్పాం. అయినా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. విద్యార్థి సంఘాల నేతలు, కాంగ్రెస్ నాయకుల్ని అరెస్టు చేశారు. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ హింసను కోరుకోదు. ప్రోత్సహించదు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి, నిరుద్యోగుల కోసం చేస్తున్న ఈ పోరాటం(Congress Jung Siren Rally)లో పాల్గొనడానికి ఎంతో మంది విద్యార్థులు, నిరుద్యోగులు ముందుకొస్తుంటే.. వాళ్లని భయభ్రాంతులకు గురి చేస్తూ అరెస్టు చేస్తున్నారు. ఇది కేసీఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులు.. రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారు."