ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్ ఇంట్లో విషాదం నెలకొంది. కరోనా బారిన పడి మధుయాస్కీ గౌడ్... అన్న భార్య మృతి చెందారు. మధుయాష్కీ పెద్దఅన్నయ్య అయిన సంతోష్ గౌడ్ భార్యకు ఏడు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా తేలింది. కుటుంబసభ్యులు ఆమెను వెంటనే కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
కరోనా బారిన పడి మధుయాస్కీ గౌడ్ వదిన మృతి - congress leader
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బాధితులు మృత్యువుతో పోరాడుతూ... వైరస్ ధాటికి ప్రాణాలు వదులుతున్నారు. ఇదే క్రమంలో మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన పెద్దన్నయ్య భార్య కొవిడ్‌తో మరణించారు. ఏడు రోజుల పాటు కామినేని ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి చివరికి తుదిశ్వాస విడిచారు.
madhuyashki goud sister in law dead with covid in kamineni hospital
ఏడు రోజుల పాటు చికిత్స తీసుకున్న ఆమె... మృత్యువుతో చేసిన పోరాటంలో ఓడిపోయారు. చివరికి మహమ్మారికి బలైపోయారు. ఆమె మరణ వార్త విని కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అంత దుఃఖంలోనూ... చికిత్స అందించి, బతికించటానికి శ్రమించిన వైద్యులు, సిబ్బందికి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.