KVS Acharyulu passes away:మధుర వ్యాఖ్యానంతో అల్లూరు నుంచి అమెరికా దాకా 5 దశాబ్దాలకుపైగా కళాభిమానులను విశేషంగా అలరించిన ప్రముఖ కవి కేవీఎస్ ఆచార్యులు (80) ఇక లేరు. అనారోగ్య సమస్యలతో బాపట్లలోని తన స్వగృహంలో ఆదివారం ఆయన కన్నుమూశారు. అద్భుత వ్యాఖ్యానం ద్వారా తెలుగు సాహిత్యంలో కొత్త ఒరవడి సృష్టించిన కేవీఎస్ ఆచార్యులు మరణంపై ప్రజాప్రతినిధులు, నేతలు, కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
KVS Acharyulu passes away: కేవీఎస్ ఆచార్యులు కన్నుమూత.. ప్రముఖుల సంతాపం - బాపట్ల జిల్లా తాజా వార్తలు
KKVS Acharyulu passes away: మధుర వ్యాఖ్యానంతో అల్లూరు నుంచి అమెరికా దాకా 5 దశాబ్దాలకుపైగా కళాభిమానులను విశేషంగా అలరించిన ప్రముఖ కవి కేవీఎస్ ఆచార్యులు (80) ఇక లేరు. ఆంధ్రప్రదేశ్ బాపట్లలోని తన స్వగృహంలో ఆదివారం ఆయన కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలోని పిట్టలవానిపాలెం మండలం అల్లూరులో జన్మించిన కాండూరి వెంకట సత్యనారాయణాచార్యులు బాపట్లలో స్థిరపడ్డారు. ‘సభా నిర్వహణ’ అనే వినూత్న ప్రక్రియ ప్రవేశపెట్టి తెలుగు రాష్ట్రాల్లో కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా పురస్కారాలు పొందారు. 18 ఏళ్లపాటు భద్రాచలం సీతారాముల కల్యాణానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి కల్యాణోత్సవాన్ని వేలమంది భక్తుల కళ్లకు కట్టినట్లుగా వివరించారు. తిరుపతి బ్రహ్మోత్సవాలకూ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 1983లో అమెరికాలో పర్యటించి పలు సభల్లో తెలుగుభాష మాధుర్యాన్ని ప్రవాసాంధ్రులకు రుచి చూపించారు.
ఇవీ చదవండి: