తెలంగాణ

telangana

ETV Bharat / city

మెట్రో ప్రయాణికులకు శుభవార్త

నగరంలోని హైటెక్​సిటీ-అమీర్​పేట్​ మెట్రోమార్గంలోని మాదాపూర్​ మెట్రోస్టేషన్​ నేడు ప్రారంభం కానుంది.  ఇప్పటి వరకు మాదాపూర్​లో ఆగాల్సిన ప్రయాణికులు దుర్గం చెరువు స్టేషన్​లో ఆగేవారు. ప్రస్తుతం ఈ స్టేషన్​ పనులు పూర్తవ్వడం వల్ల అధికారులు నేడు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.

నేడు మాదాపూర్​ ​ మెట్రోస్టేషన్ ప్రారంభం

By

Published : Apr 13, 2019, 5:46 AM IST

Updated : Apr 13, 2019, 10:02 AM IST

నేడు మాదాపూర్​ ​ మెట్రోస్టేషన్ ప్రారంభం

ఇవాళ్టి నుంచి మాదాపూర్ మెట్రో స్టేషన్​లోకి ప్రయాణికులకు అనుమతి ఇవ్వనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. హైటెక్ సిటీ-అమీర్ పేట్ మార్గంలో సేవలు ప్రారంభించిన సమయంలో 4 స్టేషన్లలో పనులు పూర్తికాలేదు.

మే చివర్లో జూబ్లీహిల్స్ చెక్​పోస్ట్ స్టేషన్ సిద్ధం

ప్రస్తుతం అన్నీ స్టేషన్లను దశల వారీగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇక మిగిలిన జూబ్లీహిల్స్ చెక్​పోస్ట్ స్టేషన్​లో మే చివరి వారంలో ప్రయాణికులకు అనుమతి ఇవ్వనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి: ఈసీ నోటీసులకు వివరణ ఇచ్చిన సీఎం కేసీఆర్

Last Updated : Apr 13, 2019, 10:02 AM IST

ABOUT THE AUTHOR

...view details