తెలంగాణ

telangana

ETV Bharat / city

పట్టాలు తప్పిన మచిలీపట్నం ఎక్స్​ప్రెస్​.. మూడు గంటల పాటు.. - తిరుపతిలో పట్టాలు తప్పిన మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్

Machilipatnam express Train Derailed in Tirupati: ఏపీలోని తిరుపతి రైల్వేస్టేషన్‌లో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. అయితే ప్రమాదం సమయంలో ట్రైన్​లో ప్రయాణికులు లేకపోవడంతో పెను ముప్పు తప్పింది.

machilipatnam-express-train-derailed-in-tirupati
machilipatnam-express-train-derailed-in-tirupati

By

Published : Apr 27, 2022, 5:56 AM IST

Train Derailed in Tirupati: ఏపీలోని తిరుపతి రైల్వేస్టేషన్‌లో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌కు పెనుప్రమాదం తప్పింది. తిరుపతి రైల్వేస్టేషన్‌లో యార్డ్‌లోనుంచి ప్లాట్‌ఫాంపైకి వెళ్తున్న క్రమంలో చిన్నమలుపు వద్ద ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ బోగీలు ప్రమాదవశాత్తు పట్టాలు తప్పాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో.. రాత్రి 9 గంటలకు బయల్దేరాల్సిన ఎక్స్‌ప్రెస్‌.. సుమారు 3 గంటలకు పైగా ఆలస్యంగా బయలుదేరింది. ప్రమాద సమయంలో ప్రయాణికులెవరూ లేకపోవటం వల్ల పెద్ద ముప్పే తప్పినట్టైంది.

ఇదీ చదవండి:Viral Video: టోల్​ సిబ్బందికి చుక్కలు చూపించిన లారీ డ్రైవర్​..

ABOUT THE AUTHOR

...view details