తెలంగాణ

telangana

ETV Bharat / city

AP Elections 2024: 'వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలతో తెదేపా పొత్తు'

AP Elections 2024: ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్​, తెదేపా పొలిట్​బ్యూరో సభ్యుడు ఎంఏ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో జగన్​ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తెదేపా, జనసేన, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేస్తాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

MA Shariff
MA Shariff

By

Published : Dec 30, 2021, 8:21 PM IST

AP Elections 2024:ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్​, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు ఎంఏ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి పాలన సాగిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వచ్చే ఎన్నికల్లో తెదేపా, జనసేన, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలో నిర్వహించిన 'గౌరవ సభ'లో పాల్గొన్న ఆయన.. జగన్ ప్రభుత్వ పాలనా విధానంపై మండిపడ్డారు. ఏపీలో బిహార్ తరహా పరిస్థితులు నెలకొన్నాయని.. సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

MA Shariff comments: ఏపీలో భద్రతతో కూడిన ప్రశాంతమైన పాలన కొనసాగాలంటే తెదేపా తిరిగి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపాకు అధికారాన్ని కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జనసేన, వామపక్షాలతో తెదేపా పొత్తుపై షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

AP Elections 2024: 'వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలతో తెదేపా పొత్తు'

ఇదీచూడండి:AP PRC News: 'మమ్మల్ని అవమానిస్తున్నారు.. ప్రభుత్వ వైఖరి మారకపోతే ఉద్యమిస్తాం'

ABOUT THE AUTHOR

...view details