ఏపీకి ఆక్సిజన్ కేటాయింపులు పెంచాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. ఆక్సిజన్ కేటాయింపులను 910 మెట్రిక్ టన్నులకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 24న రాష్ట్రానికి 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారని.. అయితే అప్పుడు రాష్ట్రంలో కేసులు 81,471 కేసులు ఉన్నాయని లేఖలో వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ బాధితుల సంఖ్య లక్షా 87 వేలు దాటిందని.. కేంద్రం ప్రస్తుతం కేటాయిస్తున్న ఆక్సిజన్.. బాధితుల చికిత్సకు సరిపోవడం లేదని పేర్కొన్నారు.
ఆక్సిజన్ కేటాయింపులు పెంచాలని ప్రధానికి ఏపీ సీఎం లేఖ - ఆక్సిజన్ కేటాయింపు, సరఫరాపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ
ఏపీకి ఆక్సిజన్ కేటాయింపులు పెంచాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఆ రాష్ట్ర సీఎం జగన్ లేఖ రాశారు. ప్రస్తుతం పాజిటివ్ కేసుల పెరిగినందున ప్రాణవాయువు సరిపోవడం లేదని పేర్కొన్నారు. చెన్నై నుంచి ఆక్సిజన్ సరఫరాలో ఆలస్యమే తిరుపతిలో 11 మంది మృతికి కారణమైందని ప్రధానికి రాసిన లేఖలో వివరించారు.
తమిళనాడు, బెంగళూరు నుంచి రాయలసీమ జిల్లాలకు ఆక్సిజన్ సరఫరా అవుతోందని చెప్పారు. చెన్నై నుంచి ఆక్సిజన్ సరఫరాలో ఆలస్యమే తిరుపతిలో 11 మంది మృతికి కారణమైందని ప్రధానికి రాసిన లేఖలో జగన్ వివరించారు. తమిళనాడు, కర్ణాటక నుంచి వస్తున్న ఆక్సిజన్ సరఫరాను పెంచకపోతే సంక్షోభకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. బళ్లారి నుంచి ప్రస్తుతం 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతోందని.. దీన్ని 150 మెట్రిక్ టన్నులకు పెంచాలని కోరారు. అలాగే ఒడిశా నుంచి 210 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతోందని దీన్ని 400 మెట్రిక్ టన్నులకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు... 20 ఎల్ఎమ్వో ట్యాంకర్లను అదనంగా రాష్ట్రానికి ఇవ్వాలని లేఖలో కోరారు.
ఇదీ చదవండి:లాక్డౌన్ ఎఫెక్ట్: వైన్స్ ముందు బారులు తీరిన మందుబాబులు