తెలంగాణ

telangana

ETV Bharat / city

Low Temperature in Telangana : రాష్ట్రంపై చలిపులి పంజా.. వణుకుతున్న జనం - తెలంగాణ ఉష్ణోగ్రతలు

Low Temperature in Telangana : రాష్ట్రంలో చలిపులి పంజా విసురుతోంది. చలి తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనాలు వణికిపోతున్నారు. సాయంత్రం అయిందంటే ఇంటి నుంచి బయట కాలుపెట్టలేని పరిస్థితి నెలకొంది.

Low Temperature in Telangana
Low Temperature in Telangana

By

Published : Feb 1, 2022, 8:37 AM IST

Low Temperature in Telangana : రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీలోని 15 సర్కిళ్లలో సోమవారం 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 8.8 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 9.9 డిగ్రీలు రికార్డయింది. మిగిలిన 13 సర్కిళ్లలో 10-15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. రానున్న రెండ్రోజులూ ఇదే పరిస్థితి ఉండనుంది. మూడో రోజు నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగి చలి తగ్గుతుందని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details