తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. 24 గంటల్లో అల్పపీడనం.. వాయుగుండంగా బలపడనున్నట్లు తెలిపింది. ఆదివారం సాయంత్రంలోగా వాయుగుండం తీరం దాటే సూచనలు ఉన్నాయని ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం - weather news
ఉత్తర అండమాన్ సముద్రం పరిసర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. 24 గంటల్లో అల్పపీడనం.. వాయుగుండంగా బలపడనుంది. తీరప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
పశ్చిమ వాయవ్య దిశగా పయనించి వాయుగుండం తీరం దాటే సూచనలు ఉన్నాయి. తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తీరప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చరించారు.
ఇవీ చూడండి: త్రివేణి జల సవ్వడులతో... జిల్లాలో పచ్చని పంటలు