తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఒకటీ రెండుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ, తెలంగాణా, ఒడిశా, ఛత్తీస్గఢ్లలోనూ చాలాచోట్ల విస్తారంగా వానలు పడే అవకాశముంది. వాయుగుండంగా మారిన అనంతరం ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ 12 న ఉదయానికి ఉత్తర కోస్తా తీరంలోని విశాఖ వద్ద తీరాన్ని దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు.