బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో 24 గంటల్లో మరింత బలపడి ఒడిశా మీదుగా పయనిస్తుందని వెల్లడించారు. నేడు నైరుతి రుతుపవనాలు దక్షిణ గుజరాత్ ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాలకు, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దక్షిణ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశాలోని కొన్ని భాగాలు, మధ్య బంగాళాఖాతం మిగిలిన భాగాలు, ఉత్తర బంగాళాఖాతంలోని చాలా భాగాల్లోకి ప్రవేశించాయన్నారు. రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వాతావరణ సూచన ఈ విధంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో రాగల 4రోజులు ఉరుమలు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాం:
- ఇవాళ , రేపు(శుక్రవారం), ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- ఎల్లుండి (శనివారం) ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.