అమ్మ, నాన్న, ఓ కూతురు.. ఎంతో ఆనందంగా సాగిపోతున్న వారి కుటుంబంలో ప్రేమ కలవరం రేపింది. అల్లారుముద్దుగా చూసుకుంటున్న కూతురు.. వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో అలజడి రేగింది. జీవితాంతం తోడుగా ఉంటానని బాస చేసిన ప్రేమికుడు ఓ వైపు.. జీవితాన్నే తన కోసం దారబోసిన తల్లిదండ్రులు మరోవైపు. ఈ పరిస్థితుల నడుమ ఆ యువతి మానసికంగా నలిగిపోయింది.
ముక్కూమొహం తెలియని వ్యక్తి.. తమ కూతురుని బాగా చూసుకుంటాడా..? లేదా.. ? అనే సంశయంతో కన్నబిడ్డ ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదు ఆ తల్లిదండ్రులు. ఏ నాటికైనా తల్లిదండ్రుల మనసు మారి, తన కుటుంబాన్ని చేరదీస్తారని భావించిన ఆ తనయ.. ప్రేమ పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకుంది. ప్రియుడితో కలిసి నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి వివాహానికి సిద్ధమైంది. కొందరు స్నేహితుల మధ్య వీరి వివాహ క్రతువు ముగిసింది.