జాతీయ రహదారిపై వందల సంఖ్యలో కండోమ్‌లు దర్శనమివ్వటం కలకలం సృష్టించింది. నిత్యం వేలాది వాహనాలు తిరిగే ప్రదేశంలో భారీగా కండోమ్‌లు ఉండటాన్ని చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు జనాలు. ఈ దృశ్యం కర్ణాటక తుమకూర్ శివారులోని జాతీయ రహదారి 48పై కనిపించింది. నగర శివారులోని శ్రీరాజ్ థియేటర్‌కు ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్‌పై కుప్పలుగా కండోమ్‌లు కనిపించాయి. అయితే.. అక్కడ వాటిని ఎవరు పారవేశారనేది తెలియరాలేదు.
Condoms: జాతీయ రహదారిపై కుప్పలుతెప్పలుగా కండోమ్‌లు - జాతీయ రహదారిపై కండోమ్‌ల కుప్పలు
నిత్యం వేలాది వాహనాలు, ప్రజలు తిరిగే జాతీయ రహదారిపై వందల సంఖ్యలో కండోమ్‌లు కనిపిస్తే ఆశ్చర్యమే కదా? అలాంటి దృశ్యమే.. కర్ణాటక, తుమకూర్‌లోని జాతీయ రహదారి 48పై కనిపించింది.

కండోమ్‌లు
Condoms: జాతీయ రహదారిపై కుప్పలుతెప్పలుగా కండోమ్‌లు
పైవంతెనపై కండోమ్‌లు అనుకోకుండా పడిపోయాయా? లేదా ఎవరైనా కావాలనే పారవేశారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కుప్పల్లో ఉన్న కండోమ్‌లు కొన్ని వినియోగించినవి కాగా.. కొన్ని ప్యాకెట్ల నుంచి తీయకుండా ఉన్నాయి.
ఇదీ చదవండి:Brutal Incident: ప్రేమించి పెళ్లి చేసుకుందని.. ఓ తల్లి నిర్వాకం