తెలంగాణ

telangana

ETV Bharat / city

చైతన్య కళాశాల నీటి ట్యాంకర్​ బీభత్సం.. ఒకరు దుర్మరణం - నారాయణ కళాశాల ఉద్యోగి మృతి

కూకట్​పల్లిలో వసంత నగర్​లో ద్విచక్రవాహనాన్ని నీటి ట్యాంకర్ ఢీ కొన్న ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

lorry hits a bike one man died at the spot in kukatpally hyderabad
చైతన్య కళాశాల నీటి ట్యాంకర్​ బీభత్సం.. ఒకరు దుర్మరణం

By

Published : Nov 27, 2019, 1:25 PM IST

కూకట్​పల్లిలో వాటర్​ ట్యాంకర్​ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడి కక్కడే మృతిచెందాడు.

వసంత నగర్​లో ఉంటున్న ఖాసీం.. నారాయణ కాలేజీలో పనిచేస్తున్నాడు. ఇవాళ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. చైతన్య కళాశాలకు చెందిన నీటి ట్యాంకర్​ బలంగా ఢీ కొంది. సుమారు 20 అడుగుల వరకు మృతదేహాన్ని ఈడ్చుకుపోయింది. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

చైతన్య కళాశాల నీటి ట్యాంకర్​ బీభత్సం.. ఒకరు దుర్మరణం

ఇవీచూడండి: టైర్​ పంక్చరై అదుపు తప్పిన బస్సు.. ఇద్దరికి అస్వస్థత

ABOUT THE AUTHOR

...view details