రంగారెడ్డి జిల్లాలో నడిరోడ్డుపై ఓ లారీ కాలిపోయింది. హయత్‌నగర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వైపు వెళ్తున్న టిప్పర్ లారీ పెద్దఅంబర్‌పేట్ సమీపంలోకి రాగానే సాంకేతిక కారణాలతో ఒక్కసారిగా ఆగిపోయింది. వెంటనే స్టీరింగ్ లాక్ కావడం వల్ల వాహనం అదుపు తప్పి విభాగిని ఢీకొట్టి కుడివైపు రోడ్డు మీదకి దూసుకుపోయింది. ఆ వేగానికి లారీ ముందు చక్రాలు ఊడిపోయాయి. వాహనం ముందు భాగం రోడ్డుపై రుద్దుకుంటూ వెళ్ళడం వల్ల నిప్పు రవ్వలు వచ్చి మంటలు అంటుకున్నాయి.
పెద్ద అంబర్‌పేట్‌లో అగ్నికి ఆహుతైన లారీ - lorry fire accident at pedda amberpet
రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్ జాతీయ రహదారిపై ఓ లారీ అగ్నికి ఆహుతైంది. సాంకేతిక కారణాలతో స్టీరింగ్ లాక్ కావడం వల్ల విభాగినిని ఢీకొట్టి నిప్పు రవ్వలు వచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలు ఆర్పివేశారు.
పెద్ద అంబర్‌పేట్‌లో అగ్నికి ఆహుతైన లారీ
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలు ఆర్పివేశారు. ఘటన సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది.
ఇదీ చూడండి: డ్రోన్‌తో తీసిన మానేరు అందాలు.. మీరూ చూడండి!
TAGGED:
lorry fire accident