కరీంనగర్-హైదరాబాద్ రాజీవ్‌రహదారిలో రేణిగుంట టోల్ ప్లాజా వద్ద ప్రమాదం చోటు చేసుకొంది. టోల్‌ప్లాజా వద్ద పైకప్పును విస్తరించేందుకు భారీ క్రేన్ సహాయంతో మరమ్మతులు చేస్తుండగా... హైదరాబాద్ వైపు నుంచి ఓ లారీ అతివేగంతో దూసుకువచ్చింది. లారీ ఢీకొనటం వల్ల క్రేన్ ముందుకు కదిలి... దానిపైన పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు కింద పడి తీవ్రగాయాల పాలయ్యారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి.
టోల్‌ప్లాజ్ వద్ద లారీ బీభత్సం.. ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు - రేణిగుంట టోల్ ప్లాజా
కరీంనగర్-హైదరాబాద్ రాజీవ్‌రహదారిలో రేణిగుంట టోల్ ప్లాజా మరమ్మతుల్లో అపశ్రుతి చోటుచేసుంది. అతివేగంతో దూసుకొచ్చిన ఓ లారీ... క్రేన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

lorry accident at renigunta toll plaza and two labour injured
టోల్‌ప్లాజ్ వద్ద లారీ బీభత్సం.. ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు
గాయపడిన ఇద్దరు క్షతగాత్రులను హుటాహుటిన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ జరుగుతున్న పనిని లారీ డ్రైవర్ గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా... లేదా నిర్లక్ష్యం వల్లే జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదీ చూడండి:ఇంటికి నిప్పు అంటుకుని బాలిక సజీవ దహనం
Last Updated : May 3, 2021, 7:45 PM IST