తెలంగాణ

telangana

ETV Bharat / city

నగరమంతా గణపతి శోభ.. ఆకట్టుకుంటున్న కార్తికేయ-2 మండపం - రాంనగర్ షోలాపూర్ వినాయకుడు

Variety Ganesh Idols in Hyderabad: వినాయక నవరాత్రుల్ని పురస్కరించుకొని హైదరాబాద్ నగరమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నగరవ్యాప్తంగా భక్తులు స్వామివారిని వివిధ రూపాలలో కొలువుదీర్చారు. రాంనగర్​లో ఏర్పాటు చేసిన షోలాపూర్ వినాయకుడి సెట్టింగ్, కాచిగూడలో కొలువైన మూడుతొండాల గణపతి విగ్రహాం చూపరులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

Variety Ganesh Idols
Variety Ganesh Idols

By

Published : Sep 2, 2022, 7:44 PM IST

Variety Ganesh Idols in Hyderabad: గణపతి నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ నగరమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన మండపాల్లో వినాయకుడు వివిధ రూపాల్లో కొలువుదీరాడు. రాంనగర్‌లో ఏర్పాటు చేసిన షోలాపూర్ వినాయకుడి సెట్టింగ్‌ భక్తులను ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదలైన కార్తికేయ-2 చిత్రానికి సంబంధించిన శ్రీకృష్ణుడి చిత్రాలు ఇందులో ఏర్పాటుచేశారు. కాచిగూడలో ఏర్పాటు చేసిన మూడు తొండాల గణపతి విగ్రహాం చూపరులను అమితంగా ఆకట్టుకుంటుంది.

దీనిని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అంతే కాకుండా నగరంలో వివిధ రూపాల్లో కొలువైన ఏకదంతుడి విగ్రహాలు భక్తులను పరవశింపజేస్తున్నాయి. మరోపక్క పోలీసులు గణనాధులకు జియో ట్యాగ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ గణపతులు ఉన్నాయి.. ఏయే ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లు, తదితర అంశాలను పర్యవేక్షించే వెసులుబాటు ఉంటుందని పోలీసులు తెలిపారు.

నగరమంతా ఆధ్యాత్మిక శోభ.. ఆకట్టుకుంటున్న కార్తికేయ-2, మూడుతొండాల గణనాధులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details