తెలంగాణ

telangana

ETV Bharat / city

LIVE UPDATES: చేవెళ్లలో రూ.20.21 లక్షలు పలికిన లడ్డూ ధర

Ganesh immersion live updates
Ganesh immersion live updates

By

Published : Sep 9, 2022, 6:48 AM IST

Updated : Sep 9, 2022, 10:14 PM IST

22:13 September 09

  • హైదరాబాద్‌: అత్తాపూర్ పోచమ్మ ఆలయంలో లడ్డూ వేలం
  • న్యూస్టార్స్ భక్త సమాజ్ ఆధ్వర్యంలో వినాయక లడ్డూ వేలం
  • వేలంలో రూ.8.11 లక్షలకు లడ్డూ దక్కించుకున్న భూపాల్ రెడ్డి

22:12 September 09

  • సంగారెడ్డి: పటాన్‌చెరు మం. రుద్రారంలో గణేశ్‌ లడ్డూ వేలం
  • మూడు లడ్డూలను రూ.13.30 లక్షలకు పాడిన ముగ్గురు భక్తులు

22:11 September 09

  • రంగారెడ్డి:చేవెళ్లలో రికార్డు ధర పలికిన వినాయక లడ్డూ
  • వేలంలో లడ్డూను రూ.20.21 లక్షలకు దక్కించుకున్న సర్పంచ్‌ శైలజ

19:39 September 09

  • సూర్యాపేట: గణేశ్‌ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి
  • గణేశ్‌ నిమజ్జనం చేస్తుండగా కాలువలో ఇద్దరు గల్లంతు
  • ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువలో సూర్య (55), నాగు (35) గల్లంతు
  • గల్లంతైన ఇద్దరి కోసం కాలువలో గాలిస్తున్న స్థానికులు
  • ఆత్మకూరు (ఎస్) మండలం కోటినాయక్ తండాలో ఘటన

18:50 September 09

  • గంగమ్మ ఒడికి ఖైరతాబాద్‌ మహాగణపతి
  • మిన్నంటిన గణపతి బప్పా మోరియా నినాదాలు
  • మహాగణపతికి వీడ్కోలు పలికేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు

18:42 September 09

గణపతి బప్పా నినాదాలతో మార్మోగుతున్న హుస్సేన్‌సాగర్ పరిసరాలు

  • హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం
  • ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నం.4 వద్ద ఖైరతాబాద్‌ గణపతి నిమజ్జనం
  • గణనాథుడికి పూజలు నిర్వహించిన ఉత్సవ సమితి సభ్యులు
  • గణపతి బప్పా నినాదాలతో మార్మోగుతున్న హుస్సేన్‌సాగర్ పరిసరాలు
  • ఖైరతాబాద్‌ నుంచి 6 గంటలకు పైగా సాగిన శోభాయాత్ర
  • మహాగణపతి నిమజ్జనం వీక్షించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు
  • మహాగణపతికి వీడ్కోలు పలికేందుకు పెద్దఎత్తున భక్తుల రాక
  • నగర నలుమూలలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాక
  • భక్తుల రద్దీతో సందడి మారిన ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు
  • కాసేపట్లో గంగమ్మ ఒడికి ఖైరతాబాద్‌ గణనాథుడు

18:37 September 09

  • హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం
  • మహాగణపతి నిమజ్జనం వీక్షించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు
  • గణేశ్‌ నామస్మరణతో మారుమోగుతున్న హుస్సేన్‌ సాగర్ పరిసరాలు
  • భక్తుల రద్దీతో సందడిగా మారిన ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు

17:33 September 09

కాసేపట్లో గంగమ్మ ఒడికి ఖైరతాబాద్‌ మహాగణపతి

  • కాసేపట్లో ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం
  • ఖైరతాబాద్‌ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు భారీ శోభాయాత్ర
  • శోభాయాత్ర వెంట భారీగా తరలివచ్చిన భక్తులు
  • అడుగడుగునా మహాగణపతికి భక్తుల నీరాజనాలు
  • ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నం.4 వద్ద ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం
  • మహాగణపతి నిమజ్జనం చూసేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు
  • నగర నలుమూలలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాక
  • భక్తుల రద్దీతో సందడి మారిన ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు

17:32 September 09

గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మేయర్‌ విజయలక్ష్మి

  • హైదరాబాద్‌: గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మేయర్‌ విజయలక్ష్మి
  • ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్‌లో ఏర్పాట్లు పరిశీలన
  • అవాంచనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు: మేయర్‌ విజయలక్ష్మి
  • వంద మంది గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారు: మేయర్
  • బోటు ఆపరేటర్లు, లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచాం: మేయర్‌
  • ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో 3 టీమ్‌లు ఏర్పాటు: మేయర్‌
  • సరూర్‌నగర్‌ వద్ద రెస్క్యూ టీమ్‌ అప్రమత్తంగా ఉంది: మేయర్‌
  • గణేశ్‌ నిమజ్జనాల తర్వాత పారిశుద్ధ్య పనులు: మేయర్‌

16:17 September 09

  • హైదరాబాద్‌: ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తత
  • వేదికపై నిర్వాహకుడు మాట్లాడుతుండగా మైకు లాక్కునేందుకు యత్నం
  • గణేశ్‌ ఉత్సవ సమితి నాయకుడు మాట్లాడుతుండగా మైకు లాక్కున్న తెరాస కార్యకర్త
  • భగవంతరావు మాట్లాడుతుండగా మైకు లాక్కున్న తెరాస కార్యకర్త నందకిశోర్‌
  • తెరాస కార్యకర్తను తీసుకెళ్లిన భాగ్యనగర్ గణేశ్‌ ఉత్సవ సమితి నాయకులు
  • తెరాస కార్యకర్తను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించిన పోలీసులు
  • అనంతరం వేదికపై ప్రసంగించిన అసోం సీఎం హిమంత బిశ్వశర్మ

16:09 September 09

  • ఆలియాబాద్ వద్దకు చేరుకున్న బాలాపూర్ గణనాథుడు

15:49 September 09

  • తెలుగుతల్లి కూడలి వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర

15:36 September 09

సరూర్‌నగర్‌ ట్యాంక్‌బండ్ వద్ద కొనసాగుతున్న గణేశ్‌ నిమజ్జనం

  • ఎల్బీ నగర్, సరూర్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేటలో వర్షం
  • నాగోల్, మూసారంబాగ్, సరూర్‌నగర్‌ ప్రాంతాల్లో వర్షం
  • సరూర్‌నగర్‌ ట్యాంక్‌బండ్ వద్ద కొనసాగుతున్న గణేశ్‌ నిమజ్జనం

15:22 September 09

ఫలక్‌నుమా వద్దకు చేరుకున్న బాలాపూర్ గణనాథుడు

  • హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణనాథుల శోభాయాత్ర
  • ఫలక్‌నుమా వద్దకు చేరుకున్న బాలాపూర్ గణనాథుడు

15:18 September 09

  • తెలుగుతల్లి పైవంతెన వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర

14:48 September 09

కర్మన్‌ఘాట్‌లోని మాధవరం సెరినిటీలో రూ.11.11 లక్షలు పలికిన లడ్డూ

  • హైదరాబాద్: కర్మన్‌ఘాట్‌లోని మాధవరం సెరినిటీలో లడ్డూ వేలంపాట
  • గణేశ్‌ లడ్డూను రూ.11.11 లక్షలకు దక్కించుకున్న జగన్మోహన్‌గౌడ్
  • హైదరాబాద్: చంపాపేట్ క్రికెట్ క్లబ్ గణేశ్‌ లడ్డూ ధర రూ.2.50 లక్షలు
  • హైదరాబాద్: లడ్డూనూ దక్కించుకున్న గూడూరు అవినాశ్‌రెడ్డి

14:38 September 09

  • రంగారెడ్డి జిల్లా: బడంగ్​పేట్ వినాయకుడి లడ్డూ వేలం పాటు
  • లడ్డూను రూ.12 లక్షలకు దక్కించుకున్న అందేలా శిరీష
  • 2021లో రూ.10 లక్షలకు దక్కించుకున్న సురేందర్ రెడ్డి
  • గతంలో కంటే రెండు లక్షలు అధికంగా పలికిన లడ్డూ ధర

14:38 September 09

  • 4వ నంబర్ క్రేన్ వద్ద కిందపడ్డ వినాయకుడి విగ్రహం
  • వాహనం నుంచి కిందకు దింపుతుండగా జారీపడ్డ గణేశ్ విగ్రహం

14:37 September 09

  • లక్డికాపూల్‌ - టెలిఫోన్ భవన్ ప్రధాన రహదారి వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ గణేశ్‌

13:59 September 09

హైదరాబాద్‌: ఎన్టీఆర్ మార్గ్‌లో కురుస్తున్న వర్షం

  • వానలో తడుస్తూనే గణనాథుల నిమజ్జనం
  • వర్షంలో భక్తుల కోలాహలం

13:59 September 09

  • హైదరాబాద్‌: రూ.3.90లక్షలు పలికిన కూకట్‌పల్లిలోని గణేశ్‌ లడ్డూ
  • కూకట్‌పల్లి భాగ్యనగర్‌ కాలనీ పద్మావతి ప్లాజాలోని వినాయకుని లడ్డూ వేలం
  • లడ్డూ దక్కించుకున్న మెుబైల్ షాప్ యజమానులు వంశీ, శ్రీనాథ్‌

13:23 September 09

గణేశ్ నిమజ్జన శోభాయాత్రను పర్యవేక్షిస్తున్న డీజీపీ

  • డీజీపీ కార్యాలయం నుంచి గణేశ్‌ నిమజ్జన శోభాయాత్రను పర్యవేక్షిస్తున్న మహేందర్‌రెడ్డి
  • రాష్ట్రంలోని పలు నగరాల్లో శోభాయాత్రను సీసీకెమెరాల ద్వారా పర్యవేక్షణ
  • పదిరోజులుగా అవాంఛనీయ ఘటనలు జరగలేదు: డీజీపీ మహేందర్‌రెడ్డి
  • 3 కమిషనరేట్ల పరిధిలో 35వేల మందితో పోలీసు బందోబస్తు: డీజీపీ మహేందర్‌రెడ్డి
  • రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల సీసీకెమెరాల ద్వారా పర్యవేక్షణ: డీజీపీ మహేందర్‌రెడ్డి

12:03 September 09

హైదరాబాద్‌: ఎన్టీఆర్ మార్గ్‌లో అశ్వికదళం

  • నాలుగో నంబర్ క్రేన్ వద్ద నుంచి ప్రజలను పంపిచేస్తున్న పోలీసులు

12:03 September 09

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఘనంగా గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర

  • నల్గొండలో గణేశ్‌కు ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభం
  • ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభించిన మంత్రి జగదీశ్‌రెడ్డి
  • ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 15 వేల విగ్రహాల నిమజ్జనం
  • నల్గొండలో క్లాక్ టవర్ మీదుగా సాగనున్న గణేశ్‌ విగ్రహాల శోభయాత్ర
  • సూర్యాపేటలో మినీ ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు
  • సూర్యాపేటలో గణేశ్‌ లడ్డూ వేలం పాట ధర రూ.11 లక్షలు
  • రూ.11 లక్షలకు లడ్డూను దక్కించుకున్న వేంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి

11:34 September 09

ఎన్టీఆర్ మార్గ్‌లో గణపతి విగ్రహాలు

  • ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం కోసం ఎన్టీఆర్ మార్గ్‌ను సిద్ధం చేస్తున్న అధికారులు
  • ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చిన వినాయక విగ్రహాలను ట్యాంక్‌బండ్ వైపు మల్లింపు

11:34 September 09

అస్వస్థతకు గురైన ఖైరతాబాద్ గణేశ్‌ ఉత్సవ కమిటీ ఛైర్మన్ సుదర్శన్

  • సుదర్శన్‌ను నిమజ్జన యాత్ర ప్రారంభానికి తీసుకొచ్చిన కమిటీ సభ్యులు

11:33 September 09

భాగ్యనగరంలో ఘనంగా గణేశ్ నిమజ్జనం వేడుకలు

  • ఎంజే మార్కెట్ ప్రధాన కూడలి మీదుగా నిమజ్జనానికి వెళ్తున్న గణపతులు
  • ఎంజే మార్కెట్ ప్రధాన కూడలి వద్ద మహిళల నృత్యాలు

11:33 September 09

హైదరాబాద్: హస్తినపురంలో వినాయకుడి లడ్డూ వేలంపాట

  • టీఎన్‌ఆర్‌ సులక్షన్‌ అపార్ట్‌మెంట్‌లో గణేశుడి లడ్డూ ధర రూ.9.91 లక్షలు
  • వినాయకుడి లడ్డూను దక్కించుకున్న లక్నపురం రాజేందర్‌రెడ్డి

11:33 September 09

చిలకలగూడ మున్సిపల్‌ మైదానంలో గణేశ్‌ను దర్శించుకున్న గవర్నర్‌

  • అకిషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్‌ను దర్శించుకున్న తమిళిసై
  • మండపం వద్ద ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ తమిళిసై
  • గణేశ్‌ నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి: గవర్నర్ తమిళిసై
  • చిలుకలగూడలోని గణేశ్‌ను దర్శించుకోవడం సంతోషంగా ఉంది: తమిళిసై

10:32 September 09

  • హైదరాబాద్‌: బాలాపూర్‌ గణేశుడి లడ్డూకు రికార్డు స్థాయి ధర
  • రూ.24.60 లక్షలకు లడ్డూ దక్కించుకున్న వంగేటి లక్ష్మారెడ్డి
  • బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యుడికే దక్కిన బాలాపూర్ లడ్డూ
  • గతేడాది కంటే రూ.5.70 లక్షలు ఎక్కువ పలికిన బాలాపూర్ లడ్డూ
  • 2021లో రూ.18.90 లక్షలు పలికిన బాలాపూర్ గణేశ్ లడ్డూ

10:28 September 09

బాలాపూర్‌ గణేశుడి లడ్డూ వేలంపాట ప్రారంభం

  • బాలాపూర్ ముఖ్యకూడలి బొడ్రాయి వద్ద గణేశుడి లడ్డూ వేలంపాట
  • బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాటలో 9 మంది పోటీ
  • లడ్డూ కోసం ఆరుగురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరుల పోటీ

10:18 September 09

బాలాపూర్‌ లడ్డూ వేలంపాటను భక్తులు ఆసక్తిగా తిలకిస్తారు : తలసాని

బాలాపూర్‌కు చేరుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

  • బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యులకు అభినందనలు : తలసాని
  • ప్రతి కార్యక్రమానికి ముందు విఘ్నేశ్వరుడికి పూజలు చేస్తాం: తలసాని
  • బాలాపూర్‌ లడ్డూ వేలంపాటను భక్తులు ఆసక్తిగా తిలకిస్తారు: తలసాని

10:18 September 09

ఖైరతాబాద్‌: మండపం నుంచి క్రేన్ సాయంతో టస్కర్‌పైకి గణేశ్‌ తరలింపు

మండపం వద్ద చివరి పూజలు చేసిన మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం

10:03 September 09

సర్కార్‌కు భగవంతరావు కృతజ్ఞతలు

  • భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు: భగవంతరావు
  • ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు: భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి
  • గణేశ్‌ నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది: భగవంతరావు

09:55 September 09

కాసేపట్లో బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాట

  • బాలాపూర్‌ గ్రామ ముఖ్యకూడలికి చేరుకున్న గణేశుడు
  • లడ్డూ వేలంపాటను తిలకించేందుకు పెద్దసంఖ్యలో వచ్చిన జనం
  • కాసేపట్లో గ్రామ ముఖ్యకూడలికి చేరుకోనున్న బాలాపూర్ గణేశుడి ఊరేగింపు
  • గణేశ్‌ ఊరేగింపులో పాల్గొన్న మంత్రి సబిత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి
  • బాలాపూర్‌కు చేరుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల

08:50 September 09

నిర్మల్‌లోని సిద్ధాపూర్ వద్ద గణేశ్‌ నిమజ్జనంలో అపశుృతి

  • స్వర్ణ వాగులో గణపతి నిమజ్జనంలో బాలుడు గల్లంతు
  • నిర్మల్‌: బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్న స్థానికులు

08:34 September 09

ట్యాంక్‌బండ్‌పై బారులు తీరిన గణనాథులు

  • హైదరాబాద్‌: ఎన్టీఆర్ మార్గ్‌లో బారులు తీరిన గణనాథులు
  • నిమజ్జనం కోసం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన గణపయ్యలు

07:42 September 09

హిమాయత్‌నగర్‌లో వర్షానికి తడిసి కూలిన గణేశ్‌ విగ్రహం

హైదరాబాద్‌: హిమాయత్‌నగర్‌లో వర్షానికి తడిసి కూలిన గణేశ్‌ విగ్రహం

హిమాయత్‌నగర్‌ బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ వద్ద పడిపోయిన గణేశ్‌ విగ్రహం

కర్మన్‌ఘాట్‌లోని టీకేఆర్‌ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన 20 అడుగుల మట్టి విగ్రహం

హైదరాబాద్‌: నిమజ్జనానికి వెళ్తుండగా కూలిన 20 అడుగుల మట్టి విగ్రహం

నవజీవన్‌ ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వినాయక విగ్రహం ఏర్పాటు

07:07 September 09

ఇవాళ బాలాపూర్‌ వినాయకుడి లడ్డూ వేలంపాట

  • రసవత్తరంగా సాగనున్న బాలాపూర్‌ గణేశుడి లడ్డూ వేలంపాట
  • ఉదయం నుంచి గ్రామంలో బాలాపూర్ గణేశుడి ఊరేగింపు
  • ఉదయం 8.30 గం.కు పూర్తికానున్న బాలాపూర్ గణేశుడి గ్రామ ఊరేగింపు
  • ఉదయం 9.30 గంటలకు బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట ప్రారంభం
  • 28 ఏళ్లలో 2021లో రికార్డు స్థాయిలో బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాట
  • 2021లో రూ.18.90 లక్షలు పలికిన బాలాపూర్ గణేశ్ లడ్డూ
  • ఈ ఏడాది లడ్డూ రూ.20 లక్షలు పలుకుతుందని అంచనా
  • 1994 నుంచి బాలాపూర్‌లో కొనసాగుతున్న గణేశ్ లడ్డూ వేలంపాట
  • మొదట రూ.450తో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలంపాట
  • 2016లో రూ.14.65 లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డూ
  • 2017లో రూ.15.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
  • 2018లో రూ.16.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
  • 2019లో రూ.17.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
  • బాలాపూర్ ముఖ్యకూడలి బొడ్రాయి వద్ద గణేశుడి లడ్డూ వేలంపాట
  • బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాటలో 9 మంది పోటీ
  • బాలాపూర్ లడ్డూ కోసం ఆరుగురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరుల పోటీ

06:42 September 09

నేడు హైదరాబాద్‌లో గణపతి నిమజ్జనం దృష్ట్యా మద్యం దుకాణాలు బంద్

  • 3 కమిషనరేట్‌ల పరిధిలో రేపు ఉ. 6 నుంచి మద్యం దుకాణాలు బంద్‌
  • నేటి నుంచి 11వ తేదీ ఉదయం 6 వరకు మూసివేయాలని పోలీసుల ఆదేశం

06:42 September 09

ఇవాళ హైదరాబాద్‌లో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

  • గణేశ్‌ నిమజ్జనం నేపథ్యంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
  • ఉదయం 6 గం. నుంచి అర్ధరాత్రి 2 వరకు మెట్రో సేవలు
  • చివరి స్టేషన్ నుంచి అర్ధరాత్రి ఒంటిగంటకు బయలుదేరనున్న మెట్రో

06:41 September 09

భాగ్యనగరంలో ఘనంగా గణేశ్ నిమజ్జనం వేడుకలు

  • వినాయక నిమజ్జనోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసిన బల్దియా
  • హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 33 క్రేన్లు ఏర్పాటు చేసిన అధికారులు
  • జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 33 చెరువుల వద్ద క్రేన్లు ఏర్పాటు
  • ట్యాంక్‌బండ్‌పై 15 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గ్‌లో 9 క్రేన్లు ఏర్పాటు
  • పీపుల్స్ ప్లాజా వద్ద 8 క్రేన్లు, 106 స్టాటిక్ క్రేన్లు, 208 మొబైల్ క్రేన్లు ఏర్పాటు
  • హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయనున్న 40 వేల వినాయక విగ్రహాలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 74 బేబీ పాండ్స్ ఏర్పాటు చేసిన అధికారులు
  • శోభా యాత్రకోసం మొత్తం 168 గణేశ్ యాక్షన్ టీమ్స్ ఏర్పాటు
  • విధుల్లో ఉండనున్న 10 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు

06:37 September 09

రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జన ఉత్సవాలు

  • నేడు భాగ్యనగరంలో వినాయక నిమజ్జనోత్సవం
  • హైదరాబాద్‌: నేడు ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర
  • ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం
  • మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నిమజ్జనం పూర్తయ్యే అవకాశం
Last Updated : Sep 9, 2022, 10:14 PM IST

ABOUT THE AUTHOR

...view details