JP will contest as a Member of Parliament: వచ్చే సాధారణ ఎన్నికల్లో.. ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ పోటీ చెయ్యాలని.. ఆ పార్టీ కమిటీ తీర్మానించింది. ప్రత్యేకహోదా, విభజన హామీలను సాధించేవరకు.. ఏపీ నుంచి జయప్రకాశ్ నారాయణ పోటీ చేయాల్సిన అవసరం ఉందని.. సమావేశం నిర్ణయించింది. వచ్చే ఎన్నికల నాటికి.. పార్టీని బలోపేతం చేయడం సహా.. కార్యాచరణపై చర్చించేందుకు విజయవాడలో లోక్‌సత్తా పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఏపీ ఎన్నికల బరిలో జేపీ.. లోక్‌సత్తా రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్ణయం - ఏపీ న్యూస్
JP will contest as a Member of Parliament: వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా జయప్రకాశ్ నారాయణ పోటీ చేయాలని లోక్‌సత్తా రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలు పరిష్కారం కావాలంటే జేపీ పోటీ చేయాలని తీర్మానించింది. పార్టీని బలోపేతం చేయడంతో పాటు.. కలిసి వచ్చే పార్టీలతో కలిసి వెళ్లాలని రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్ణయించారు.
JP will contest as a Member of Parliament
జయప్రకాశ్ నారాయణతో కలిసివచ్చే వారితో నూతన రాజకీయ వేదిక నిర్మాణం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. త్వరలో లోక్‌సత్తా పార్టీ నాయకులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించాలని తీర్మానించారు.
ఇవీ చదవండి: