తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉపాధి కల్పనకే సహకార బ్యాంకులను ప్రోత్సహిస్తున్నాం: ఓం బిర్లా - lok sabha speaker hyderabad tour

బంజారాహిల్స్​లోని మహేశ్​ కో-ఆపరేటివ్​ అర్బన్​ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని లోక్​సభ స్పీకర్​ ఓం ప్రకాశ్​ బిర్లా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి ప్రారంభించారు.

ఉపాధి కల్పనకే సహకార బ్యాంకులను ప్రోత్సహిస్తున్నాం: ఓం బిర్లా

By

Published : Oct 23, 2019, 11:14 PM IST

బంజారాహిల్స్​లోని మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని లోక్​సభ స్పీకర్​ ఓం ప్రకాశ్ బిర్లా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి ప్రారంభించారు. హిమాచల్​ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఆర్థిక మందగమన పరిస్థితులున్న దృష్ట్యా తక్కువ వడ్డీకే రుణాలు అందే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోందని స్పీకర్​ అన్నారు. మహిళలు ఉపాధి పొందేందుకు సహకార బ్యాంకులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కార్పొరేట్ పన్ను తగ్గించి పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పించామని కిషన్​రెడ్డి పేర్కొన్నారు.

ఉపాధి కల్పనకే సహకార బ్యాంకులను ప్రోత్సహిస్తున్నాం: ఓం బిర్లా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details