రాష్ట్రంలో జోన్ల పునర్ వ్యవస్థీకరణ, కొత్త జిల్లాలకు ఆమోదం తెలపాలని తెరాస పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి కేంద్రప్రభుత్వాన్ని కోరారు. రూల్ నంబర్ 377 కింద లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన రంజిత్ రెడ్డి... మెరుగైన పాలన అందించేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జోగులాంబ జోన్-7లో ఉన్న వికారాబాద్ జిల్లాను.. చార్మినార్ జోన్-6 కిందకు చేర్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ రెండుప్రతిపాదనలు కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్‌లో ఉండటంతో జోనల్, మల్టీజోనల్, జిల్లా క్యాడర్ పోస్టులను భర్తీ చేయలేకపోతున్నట్లు రంజిత్ రెడ్డి... కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి.. ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేందుకు మార్గం సుగమం చేయాలని కోరారు.
జోన్ల పునర్వ్యవస్థీకరణను ఆమోదించాలి: ఎంపీ రంజిత్‌రెడ్డి
జోన్ల పునర్వ్యవస్థీకరణను ఆమోదించాలని లోక్‌సభలో ఎంపీ రంజిత్‌రెడ్డి కేంద్ర సర్కారును కోరారు. ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉండడం వల్ల జోనల్, మల్టీ జోనల్, జిల్లా క్యాడర్ పోస్టులు రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేకపోతోందన్నారు. ఐటీఐఆర్‌పై మరోసారి కేంద్రాన్ని ఎంపీ రంజిత్‌రెడ్డి వివరణ కోరారు.
ఐటీఐఆర్‌పై మరోసారి కేంద్రాన్ని ఎంపీ రంజిత్‌రెడ్డి వివరణ కోరారు. ఐటీఐఆర్‌ను రద్దు చేసినట్లు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర ఐటీశాఖ మంత్రి.. ఐటీఐఆర్ రద్దు చేస్తూ గతంలోనే నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఐటీఐఆర్‌ను పునరుద్ధరించాలని గతంలో మూడుసార్లు రాష్ట్రప్రభుత్వం లేఖ రాసిందన్న కేంద్రం.. మారిన పరిస్థితుల దృష్ట్యా.... ఆ విధానాన్ని రద్దు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం పారిశ్రామిక క్లస్టర్లు, టౌన్‌షిప్‌లను ప్రోత్సహిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి:'పరస్పర సహకారంతోనే ఉమ్మడి శత్రువుపై పోరు'