తెలంగాణ

telangana

ETV Bharat / city

LokSaba Speaker: తిరుమల శ్రీవారి సన్నిధిలో లోక్​సభ స్పీకర్ ఓంప్రకాశ్‌ బిర్లా

లోక్​సభ స్పీకర్ ఓంప్రకాశ్‌ బిర్లా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్పీకర్​కు తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ.సుబ్బారెడ్డి ఇతర అధికారులు కలిసి స్వాగతం పలికారు.

lokh-sabha-speaker-om-birla-visited-tiruchanur-padmavati-temple
తిరుమల శ్రీవారి సన్నిధిలో లోక్​సభ స్పీకర్ ఓంప్రకాశ్‌ బిర్లా

By

Published : Aug 17, 2021, 12:26 AM IST

Updated : Aug 17, 2021, 9:52 AM IST

తిరుమల శ్రీవారిని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్​కు తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ.సుబ్బారెడ్డి ఇతర అధికారులు కలిసి స్వాగతం పలికారు. శ్రీ‌వారి మూలమూర్తిని దర్శించుకున్న ఆనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా... తితిదే ఛైర్మన్.. స్పీకర్​ను శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. వారి వెంట రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారు.

పద్మావతి అమ్మవారి సేవలో..

దేశం క్షేమంగా ఉండాలని.. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ పద్మావతి అమ్మవారిని కోరుకున్నట్లు లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనార్ధం తిరుపతికి వచ్చిన ఆయన.. తొలుత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆ తరువాత శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన ఆయన రోడ్డు మార్గంలో తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయం వద్ద తితిదే ఛైర్మన్​ వై.వీ.సుబ్బారెడ్డి, ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేకపూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇదీ చదవండి:CBI: ఆ కేసులో మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కీలక ఆధారాలున్నాయి

Last Updated : Aug 17, 2021, 9:52 AM IST

ABOUT THE AUTHOR

...view details