Lokesh Aprilfool Video: 'జనం చెవిలో జగన్ పూలు'.. వీడియో విడుదల చేసిన లోకేశ్ - జనం చెవిలో జగన్ పూలు వీడియో విడుదల చేసిన లోకేశ్
Lokesh Aprilfool Video: ఎన్నికల హామీల విషయంలో రాష్ట్ర ప్రజలను ఏపీ సీఎం జగన్.. ఏప్రిల్ ఫూల్ చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ దుయ్యబట్టారు. వైకాపా ప్రొడక్షన్స్ సమర్పించు ఓ అత్యద్భుతమైన సినిమా 'ఏప్రిల్ 1 విడుదల' అంటూ.. ఓ వీడియోను ఆయన విడుదల చేశారు. జనం చెవిలో జగన్ పూలు పెట్టారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపు, మద్య నిషేధం హామీ, ప్రత్యేక హోదా సాధన, సన్నబియ్యం పంపిణీ హామీలు ఏప్రిల్ ఫూల్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజధాని అమరావతి, వారం రోజుల్లో సీపీఎస్ రద్దు హామీలు విస్మరించిన తీరును ఎండగడుతూ.. నాలుగున్నర నిమిషాల వీడియోను తన ట్విటర్ ఖాతాకు జత చేశారు.
Lokesh Aprilfool Video: 'జనం చెవిలో జగన్ పూలు'.. వీడియో విడుదల చేసిన లోకేశ్