Nara lokesh Abour Cm jagan Comments : గల్లీ నుంచి దిల్లీ వరకూ పనికిమాలినోడని తేలిపోయాక, ఫ్రస్ట్రేషన్ కాకపోతే.. ఫన్ వస్తుందా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. నంద్యాల సభలో ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై లోకేశ్ ఘాటుగా స్పందించారు. జగన్కు ఉన్నంత ఓపిక, తీరిక తమకు లేదని లోకేశ్ స్పష్టం చేశారు. వైకాపా నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో తాము పనిచేస్తున్నామన్నారు. ప్రజలే వైకాపా వెంట్రుకలు పీకి, గుండు కొట్టించి పిండిబొట్లు పెట్టడానికి సిద్దంగా ఉన్నారని విమర్శించారు. అందుకే.. జగన్రెడ్డి తనంతట తాను గుండు కొట్టించుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. 'వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ జగన్ రెడ్డి' అంటూ ట్వీట్ చేశారు. నంద్యాలలో సీఎం చేసిన వ్యాఖ్యలను జత చేశారు.
Nara Lokesh Comments on Jagan : 'జగన్కు ఉన్నంత ఓపిక, తీరిక మాకు లేదు' - Nara lokesh Abour Cm jagan Comments
Nara lokesh Abour Cm jagan Comments : నంద్యాల జిల్లాలో నిర్వహించిన సభలో ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఘాటుగా స్పందించారు. జగన్కు ఉన్నంత ఓపిక, తీరిక తమకు లేదని ఎద్దేవా చేశారు.
Nara Lokesh Comments on Jagan
Jagan Comments at Nandyal :"దేవుడి దయ, ప్రజల దీవెనలు ఉన్నంతకాలం.. ఎంతగా బురదచల్లినా ఎవరూ నన్నేమీ చేయలేరు" అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తాము సంక్షేమం కోసం పాటుపడుతుంటే.. ప్రతిపక్షాలు, మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని నంద్యాల సభలో జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
- ఇదీ చదవండి :నన్ను తిట్టి.. నా సహనాన్ని పరీక్షించొద్దు